50000+ కొత్త శిఖరంపై సెన్సెక్స్

0
220
Spread the love

దలాల్‌స్ట్రీట్‌ వర్గాల్లో బడ్జెట్‌ జోష్‌ ఇంకా తగ్గలేదు.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసింది. ఈక్విటీ సూచీలు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయిలను నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రేడింగ్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ మరో 458.03 పాయింట్లు బలపడి 50,255.75 వద్ద స్థిరపడింది. 50,526.39 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసుకున్నప్పటికీ.. చివర్లో కాస్త దిగివచ్చింది. సూచీ 50,000 ఎగువన ముగియడం ఇదే తొలిసారి. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 142.10 పాయింట్ల లాభంతో 14,789.95 వద్దకు చేరుకుంది. 14,868.85 వద్ద సరికొత్త ఇంట్రాడే రికార్డు నమోదైంది. సానుకూల గ్లోబల్‌ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సూచీలు మరింత ఎగబాకేందుకు దోహదపడ్డాయి. నేటి సెషన్‌లో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఫార్మా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు కొనసాగగా.. సిమెంట్‌, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో మాత్రం మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు.

40 ఏళ్లగా కాకతీయ మ్యారేజస్.పెళ్లి సంబంధాలకు ఉచితం గా రిజిస్టర్ కండి.PH: 9390 999 999, 98481 97 222Feb 4 2021 @ 00:55AMహోంబిజినెస్50000+ కొత్త శిఖరంపై సెన్సెక్స్‌అన్నపూర్ణ మ్యారేజెస్ అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు చూడబడును.PH: 9397979750ఉన్నతమైన కుటుంబాల ఎంపిక
ముచ్చటగా మూడో రోజూ లాభాలు..

రూ.12 లక్షల కోట్లు పెరిగిన సంపద

ముంబై: దలాల్‌స్ట్రీట్‌ వర్గాల్లో బడ్జెట్‌ జోష్‌ ఇంకా తగ్గలేదు. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసింది. ఈక్విటీ సూచీలు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయిలను నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రేడింగ్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ మరో 458.03 పాయింట్లు బలపడి 50,255.75 వద్ద స్థిరపడింది. 50,526.39 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసుకున్నప్పటికీ.. చివర్లో కాస్త దిగివచ్చింది. సూచీ 50,000 ఎగువన ముగియడం ఇదే తొలిసారి. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 142.10 పాయింట్ల లాభంతో 14,789.95 వద్దకు చేరుకుంది. 14,868.85 వద్ద సరికొత్త ఇంట్రాడే రికార్డు నమోదైంది. సానుకూల గ్లోబల్‌ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సూచీలు మరింత ఎగబాకేందుకు దోహదపడ్డాయి. నేటి సెషన్‌లో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఫార్మా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు కొనసాగగా.. సిమెంట్‌, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో మాత్రం మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు.

ఇండ్‌సఇండ్‌ టాప్‌ గెయినర్‌

సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 23 లాభపడగా.. మిగతా ఏడు నష్టాలు చవిచూశాయి. ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ 7.65 శాతం లాభంతో సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. పవర్‌గ్రిడ్‌ 6.28 శాతం పుంజుకుంది. డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ 3 శాతానికి పైగా పెరిగాయి. అలా్ట్రటెక్‌ సిమెంట్‌, మారుతి సుజుకీ, ఐటీసీ, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.

వీ-మార్ట్‌ రూ.375 కోట్ల సేకరణ : అర్హులైన సంస్థాగత కొనుగోలుదారుల(క్యూఐబీ)కు షేర్ల జారీ ద్వారా రూ.374.99 కోట్లు సేకరించినట్లు వీ-మార్ట్‌ రిటైల్‌ ప్రకటించింది. 30 మంది క్యూఐబీలకు రూ.10 ముఖవిలువ కలిగిన 15,30,612 షేర్లను ఒక్కొక్కటీ రూ.2,450 చొప్పున విక్రయించింది.

జీ మీడియా రూ.230 కోట్ల సమీకరణ : నాన్‌ కన్వర్టిబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.230 కోట్లు సమీకరించినట్లు జీ మీడియా కార్పొరేషన్‌ వెల్లడించింది. ఇందులో భాగంగా ఒక్కొక్కటీ రూ.10 లక్షల విలువ చేసే 2,300 డిబెంచర్లను జారీ చేసింది.

రూ.200 లక్షల కోట్లకు నిచ్చెన..

మూడు రోజుల వరుస లాభాలతో బీఎ్‌సఈ ఇన్వెస్టర్ల సంపద రూ.12 లక్షల కోట్లకు పైగా పెరిగింది. నేటి సెషన్‌లో రూ.1.83 లక్షల కోట్ల పెరుగుదలతో రూ.198.45 లక్షల కోట్లకు చేరుకుంది.

ఎఫ్‌పీఐ పెట్టుబడుల కొత్త రికార్డు

భారతదేశ అభివృద్ధి అవకాశాలపై విదేశీ ఇన్వెస్టర్లు ఎనలేని విశ్వాసం ప్రకటిస్తున్నారు. కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో కూడా 2020-21లో స్టాక్‌మార్కెట్‌కు ఎఫ్‌పీఐ పెట్టుబడులు వెల్లువెత్తాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు భారత మార్కెట్‌లో 3170 కోట్ల డాలర్ల (రూ.2,35,268 కోట్లు) పెట్టుబడులు పెట్టారు. ఇప్పటివరకు 2012-13లో నమోదైన ఎఫ్‌పీఐ పెట్టుబడుల చారిత్రక గరిష్ఠ స్థాయి 2580 కోట్ల డాలర్లను (రూ.1,40,033 కోట్లు) ఇది అధిగమించింది. వారం రోజుల పాటు విరామం తర్వాత ఏర్పడిన బడ్జెట్‌ అనంతర మూడు రోజుల ర్యాలీలో రెండు రోజుల్లోనే ఎఫ్‌పీఐలు 100 కోట్ల డాలర్లు (రూ.8030 కోట్లు) పెట్టుబడి పెట్టారు.

సంవత్సరం పెట్టుబడి

(రూపాయల్లో)

2010-11 1,10,121

2011-12 43,738

2012-13 1,40,033

2013-14 79,709

2014-15 1,11,333

2015-16 -14,172

2016-17 55,703

2017-18 25,635

2018-19 – 88

2019-20 6,153

2020-21 2,35,268

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here