
Gold Rate | మహిళలకు ఇది ఊరట కలిగించే వార్త. దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.300 వరకు తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.220 దిగి వచ్చింది.
ఇక వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలోకు రూ.400 వరకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.54,200కి చేరగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,100కి చేరింది.
ముంబయిలో 22 క్యారెట్ల స్వర్ణం రేటు రూ.54,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.58,960 తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ.54,050కి తగ్గగా.. 24 క్యారెట్ల స్వర్ణం రేటు రూ.59,410కి తగ్గింది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,050కి తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం రూ.58,960 పలుకుతున్నది.
విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంతో పాటు పలు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర హైదరాబాద్‌లో కిలో రూ.75,700కి చేరింది.