బెంగాల్‌ గెలుపు.. తెలంగాణకు బాట

0
178
Spread the love

రానున్న ఏప్రిల్‌-మే నెలల్లో జరిగే బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లోని బీజేపీ విజయం.. ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి బాట వేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని బీజేపీ సోషల్‌ మీడియా వారియర్స్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో మూడింట రెండొంతుల ఆధిక్యం సాధించి.. అధికారంలోకి వచ్చే వరకూ కంటిపై కునుకు లేకుండా శ్రమిస్తామన్నారు. బెంగాల్‌లో మమతను ఓడించడం ఒకటే తమ లక్ష్యం కాదని.. బెంగాల్‌ను ‘బంగారు బెంగాల్‌’గా తీర్చిదిద్దడం కూడా తమ లక్ష్యమన్నారు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న కరోనా టీకా పంపిణీ కార్యక్రమం అయిపోగానే.. సీఏఏ అమలు మొదలువుతుందని గురువారం ఓ ర్యాలీలో స్పష్టం చేశారు. మతువా సామాజిక వర్గంతోపాటు శరణార్ధులకు భారత పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ త్వరలోనే.. టీకా పంపిణీ అయిపోగానే ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ చట్టంపై కొందరు దురుద్దేశపూర్వకంగా మైనారిటీలను తప్పుదోవ పట్టిస్తున్నారని మమతనుద్దేశించి విమర్శించారు.

‘సీఏఏను రాష్ట్రంలోకి రానివ్వనని మమతా దీదీ అన్నారు. అయితే, ఏప్రిల్‌-మే తర్వాత ఆమె సీఎంగా ఉండరు. మేమే అధికారంలోకి వస్తాం. అప్పుడు ఎలా ఆపుతారు. అయినా.. సీఏఏ అనేది పార్లమెంట్‌ చేసిన చట్టం. మేం అమలు చేసి తీరుతాం’ అన్నారు. కాగా, మతువాలు.. తూర్పు పాకిస్థాన్‌లోని మైనారిటీలు. ఆ ప్రాంతం బంగ్లాదేశ్‌గా ఆవిర్భావ సమయంలో భారత్‌కు వలస వచ్చారు. దాదాపు 30లక్షల మంది మతువాలు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ఉన్నారని అంచనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here