దేశంలో ప్రయోగ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేకుండానే.

తమ కరోనా టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ డిసెంబరులో ఫైజర్ కంపెనీ సమర్పించిన దరఖాస్తును భారత్ తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధమైన అనుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీఓ)కు విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) బుధవారం సిఫారసు చేసింది.దీంతో తమ దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు ఫైజర్ శుక్రవారం ప్రకటించింది. అదనపు సమాచారం అందుబాటులోకి రాగానే మళ్లీ దరఖాస్తు చేసుకుంటామని ఫైజర్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.