భారత నావికా దళంలో 1159 పోస్టులు

0
350
Spread the love

అతి పెద్ద సముద్ర తీరంగల దేశం భారత్‌. మూడుపక్కల సముద్రంతో ఉంది. తీరప్రాంత రక్షణ బాధ్యతలను నావికాదళం చూస్తుంది. కేవలం పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో నావికా దళంలో ఉద్యోగావకాశం, మంచి జీతభత్యాలు, భద్రమైన కొలువులు. కేవలం రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఈ పోస్టులకు సంబంధించి ఇన్‌సెట్‌ -టీఎంఎం నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో వివరాలు సంక్షిప్తంగా.

భారత నావికా దళంలో 1159 పోస్టులు

18- 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఐదేండ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఉద్యోగ బాధ్యతలు
షాప్‌, షిప్‌ లేదా సబ్‌మెరైన్‌లో మెయింటెనెన్స్‌ చేయాలి.
సంబంధిత సెక్షన్‌ లేదా యూనిట్‌లో సాధారణ పరిశుభ్రత, నిర్వహణ బాధ్యతలు
సంబంధిత ఆఫీస్‌లో ఫైల్స్‌, ఇతర పేపర్లను తేవడం, మార్చడం వంటి పనులు చేయాలి.
సంబంధిత సెక్షన్‌ లేదా యూనిట్‌లో నాన్‌ క్లరికల్‌ పనులు చేయాలి.
డైరీ, డిస్పాచ్‌, కంప్యూటర్‌ తదితర పనులను చేయాలి.
డాక్‌ డెలివరీ చేయాలి
వాచ్‌ అండ్‌ వార్డ్‌ డ్యూటీలు
ఆఫీస్‌ తెరవడం, మూయడం వంటి విధులు నిర్వహించాలి.
ఫర్నిచర్‌, పార్క్‌లు, లాన్‌, మొక్కలు తదితర పనులతోపాటు పై అధికారుల ఆదేశాలను నిర్వర్తించడం చేయాలి.
ఎంపిక విధానం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే మొదట పరీక్షకు అనుమతిస్తారు. తర్వాత దశల్లో రకరకాల స్క్రూటినీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష విధానం
అర్హత ఉన్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌కు అనుమతిస్తారు.
ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు ఇస్తారు.
పరీక్షలో ప్రశ్నలు పదోతరగతి, ఐటీఐ స్థాయి నుంచి ఇస్తారు.
మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. దీనిలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ నుంచి 25 ప్రశ్నలు, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌/క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుంచి 25 ప్రశ్నలు, జనరల్‌ ఇంగ్లిష్‌, కాంప్రహెన్షన్‌ నుంచి 25 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు.
రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
భారత నావికాదళం వివిధ కమాండ్ల పరిధిలో ఖాళీగా ఉన్న ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇండియన్‌ నేవీ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఇన్‌సెట్‌-టీఎంఎం)-01/2021 ప్రకటన విడుదల చేసింది.

పోస్టు: ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌
(గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌ ఇండస్ట్రియల్‌)

పేస్కేల్‌: రూ.18,000-56900/-

మొత్తం ఖాళీలు: 1159

కమాండ్ల వారీగా ఖాళీలు:
ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్ ‌710

వెస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌ 324

సదరన్‌ నేవల్‌ కమాండ్‌ 125

ముఖ్య తేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: మార్చి 7 (సాయంత్రం 5 వరకు)

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here