మదనపల్లె కేసు: జైల్లో ఖైదీలకు చుక్కలు చూపించిన పద్మజ

0
180
Spread the love

చిత్తూరు: మదనపల్లె జంట హత్యల కేసులో నిందితురాలు పద్మజ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

జైలులో రాత్రంతా శివ శివ అంటూ కేకలు పెట్టడంతో తోటి ఖైదీలంతా హడలిపోయి జాగారం చేశారు. జైలులో రెండు మహిళా బ్యారక్‌లో 15 మంది ఖైదీలకు పద్మజ చుక్కలు చూపించారు. పద్మజ తీరుతో జైలు అధికారులు అవస్థలు పడుతున్నారు. ‘నేనే శివుడిని నన్నే లోపల వేస్తారా’ అంటూ మదనపల్లి సబ్ జైలులో ఉన్న పద్మజ అరుపులు, కేకలతో హోరెత్తించారు. దీంతో తోటి ఖైదీలు హడలెత్తిపోతున్నారు. మదనపల్లిలో జరిగిన ఇద్దరు కుమార్తెల హత్య కేసులో సబ్ జైలులో ఉన్న పద్మజ, పురుషోత్తమ నాయుడు మానసిక పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి రాలేదు. పద్మజ యధావిధిగా జైలులో అరుపులు, కేకలతో హడలెత్తిస్తుండగా… పురుషోత్తమ నాయుడు అప్పుడప్పుడు కుమార్తెలను తలుచుకుంటూ ఏడుస్తున్నారు. ఎస్కార్ట్ అధికారులు స్పందించంకపోవడంతో…పద్మజ విశాఖపట్నం మానసిక వైద్యశాల తరలింపుకు ఆలస్యమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here