మనుషులకూ బర్డ్‌ ఫ్లూ!

0
149
Spread the love

ప్రపంచంలోనే తొలిసారిగా ‘హెచ్‌5ఎన్‌8’ రకం బర్డ్‌ ఫ్లూ వైరస్‌ మనుషులకు సోకింది. దక్షిణ రష్యాలోని ఒక పౌలీ్ట్ర ఫామ్‌లో పనిచేసే ఏడుగురికి ఈ స్ట్రెయిన్‌ సోకినట్లు రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. వెక్టర్‌ లేబొరేటరీ వైద్య పరీక్షలు నిర్వహించగా ఆ ఏడుగురిలో ‘హెచ్‌5ఎన్‌8’ జన్యుపదార్థం జాడ ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. తేలికపాటి బర్డ్‌ ఫ్లూ ఇన్ఫెక్షన్‌ సోకడంతో వారిలో ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని.. స్వల్ప చికిత్సతో త్వరగానే కోలుకున్నారని తెలిపింది. మనుషుల నుంచి మనుషులకు ‘హెచ్‌5ఎన్‌8’ సోకడం లేదని స్పష్టం చేసింది. 2020 డిసెంబరులో ఇదే పౌలీ్ట్ర ఫామ్‌లోని కోళ్లకు బర్డ్‌ ఫ్లూ ప్రబలిన విషయాన్ని రష్యా ఆరోగ్యశాఖ గుర్తు చేసింది. ఈ వివరాలన్నీ డబ్ల్యూహెచ్‌వోకు అందించినట్లు తెలిపింది. ‘‘మనుషుల్లో ‘హెచ్‌5ఎన్‌8’ బర్డ్‌ ఫ్లూ ఇన్ఫెక్షన్‌ గుర్తింపు ప్రమాద హెచ్చరిక. భవిష్యత్తులో ఆ వైరస్‌ స్ట్రెయిన్‌ మరిన్ని జన్యుమార్పులకు గురై ప్రబలితే ఎలా స్పందించాలో నిర్ణయించుకునేందుకు ప్రపంచానికి తగిన సమయం దొరికింది. ఈ ఇన్ఫెక్షన్‌ నిర్ధారణకు పరీక్షలు, నివారణకు వ్యాక్సిన్ల అభివృద్ధిపై ఇప్పటినుంచే దృష్టిపెట్టే వీలు కలిగింది’’ అని రష్యా ప్రజారోగ్య విభాగం చీఫ్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here