మరో మదనపల్లె..! రాత్రంతా పిచ్చిపట్టినట్టుగా

0
164
Spread the love

విశాఖపట్నం: రాష్ష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె ఘటన తరహాలోనే విశాఖలోనూ ఓ కుటుంబం చేసిన వింత చేష్టలతో స్థానికులు హడలెత్తిపోయారు.

Similar To Madanapalle Incident Family Strange Actions Make Shocking - Sakshi

వివరాల ప్రకారం.. విశాఖ అజిమాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇంటి లోపల గడియపెట్టుకొని రాత్రంతా పిచ్చిపిచ్చి కేకలు, శబ్దాలు చేశారు. ఎంత పిలిచినా బయటకు రాపోవడంతో మదనపల్లి తరహా ఘటన జరిగిందేమోనని స్ధానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు తీసే ప్రయత్నం చేసినా అటునుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు పగలకొట్టి నలుగురు కుటుంబసభ్యులను బయటకు తీసుకువచ్చారు. వారి మాటలను గమనించిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ మళ్ళేశ్వరరావు మానసికంగా ఒత్తిడికి గురవున్నట్టు తెలిపారు. భర్త అబ్దల్ మజీద్ , భార్య మేహరో,కొడుకు నూరుద్దీన్ ,కూతురు నూర్ గత కొన్నాళ్లుగా మానసిక రుగ్మతకు గుర్తె పిచ్చి కేకలు వేస్తున్నట్టు స్ధానికులు చెప్పినట్లు పేర్కొన్నారు. నలుగురుని వ్తెధ్యం కోసం నగరంలోని మానసిక వ్తెద్యశాలకు తరలించినట్లు సిఐ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here