రోహన్ బోపన్న-ఐసమ్ ఉల్ హక్ ఖురేషీ జోడీ గుర్తుందిగా! ప్రపంచ టెన్ని్‌సలో ఇండో-పాక్ ఎక్స్‌ప్రె్‌సగా ఖ్యాతికెక్కిన ఈ ఇద్దరూ జంటగా పురుషుల డబుల్స్‌లో ఎన్నో మధురమైన విజయాలు అందుకున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా, కలిసి ఆడి 2010లో విజయవంతమైన డబుల్స్ జోడీగా పేరుతెచ్చుకొని క్రీడాస్ఫూర్తిని చాటారు. చివరిగా 2014 (షెన్‌జెన్ టోర్నీ)లో కలిసి ఆడిన ఇద్దరూ.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ జత కడుతున్నారు. ఈ నెల 15 నుంచి మెక్సికోలో జరిగే అకాపుల్కో ఏటీపీ 500 ఈవెంట్‌లో డబుల్స్ జోడీగా బరిలోకి దిగుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా బోపన్న వెల్లడించాడు. ‘ప్రస్తుతానికైతే మెక్సికో ఈవెంట్‌లో కలిసి ఆడుతున్నాం. మున్ముందు మరిన్ని టోర్నీల్లో జతకట్టేది లేనిదే ఇప్పుడే చెప్పలేను’ అని 40 ఏళ్ల బోపన్న తెలిపాడు. బోపన్న, ఖురేషీ తమ కెరీర్‌లో అత్యుత్తమంగా 2010 యూఎస్ ఓపెన్‌లో డబుల్స్ ఫైనల్ చేరారు.
