ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏఎల్)లో ఏసీఎ్‌సఏ గ్లోబల్, బిడ్ సర్వీసెస్ డివిజన్ (మారిషస్) లేదా బిడ్ వెస్ట్‌కు చెందిన 23.5 శాతం వాటాలను రూ.1,685.25 కోట్లకు చేజిక్కించుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది. అనుబంధ సంస్థ అదానీ ఎయిర్‌పోర్ట్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఏఏహెచ్‌ఎల్) ఈ కొనుగోలును పూర్తి చేసిందని తెలిపింది. ఎంఐఏఎల్‌లో నియంత్రిత వాటాలను దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఏఏహెచ్‌ఎల్ ఈ కొనుగోలును పూర్తి చేసిందని పేర్కొంది. ఇందులో భాగంగానే ఒక్కోటి రూ.10 ముఖ విలువ కలిగిన 28.20 కోట్ల షేర్లను (23.5 శాతం వాటాకు సమానమైన) కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఎంఐఏఎల్‌లో మెజారిటీ వాటాలను గత ఏడాది జీవీకే గ్రూప్ నుంచి అదానీ గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
