నిర్మల్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్రా కే గ్రామంలో దళితులకు ఇచ్చిన భూముల్లో పండించిన పంటల మధ్య కవిత జన్మదిన వేడుకలు నిర్వహించారు. కవిత చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. కవిత తెలంగాణ బతుకమ్మ అని, ఆమె రాష్ర్ట మహిళలకు ఆదర్శమని గ్రామ మహిళలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, అర్చన, మీనా, రేఖతో పాటు పలువురు పాల్గొన్నారు.
