ఉపాధ్యాయుల హాజరు కోసం ఏపీటీఎల్ యాప్, విద్యార్థుల కోసం స్టూడెంట్ అటెండెన్స్ యాప్, మధ్యాహ్న భోజన పథకానికి ఐఎంఎంఎస్ యాప్, జగనన్న విద్యాకానుక కోసం జేవీకే యాప్, జగనన్న గోరుముద్ద యాప్, దీక్ష యాప్, అభ్యాస్ యాప్, నిష్టా యాప్, ‘నాడు-నేడు’ యాప్… ఇలా రకరకాల యాప్‌లతో ప్రభుత్వరంగ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వీటికి తోడు సీఎస్‌ఈ వెబ్‌సైట్, అమ్మఒడి వెబ్‌సైట్, ఎస్‌టీఎంఎస్ వెబ్‌సెట్ బాధ్యతలు సరే సరి

తరగతి గదుల్లో విద్యార్థులకు బోధన చేయాల్సిన ఉపాధ్యాయులు సాంకేతిక బాధ్యతలతో సతమతమవుతున్నారు. పిల్లలకు చదువులు చెప్పడం కన్నా యాప్‌లను పూర్తి చేస్తే చాలు అన్న ధోరణిలో ప్రభుత్వం ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పాఠశాలల్లో ఈ-హాజరు ఓ ప్రహసనంగా మారింది. రోజూ ఉదయం ఒకసారి, సాయంత్రం మరోసారి చొప్పున రోజుకు రెండుసార్లు విద్యార్థుల హాజరు నమోదు చేయాలి. స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయగానే తరగతుల వారీగా విద్యార్థుల వివరాలు కనిపిస్తాయి. పాఠశాలకు హాజరైన, హాజరు కానివారి వివరాలు అందులో అప్‌లోడ్ చేయాలి. ఇది ఉపాధ్యాయుల దైనందిన కార్యక్రమం.
రోజూ మొద టి పీరియడ్‌లో సగం సమయం కేవలం దీనికే సరిపోతోంది. ఇక బోధన విషయం చెప్పాల్సిన పనే లేదు. గతంలో ఏ తరగతిలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది గైర్హాజరయ్యారనే సమాచారం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు విద్యార్థుల హాజరు వివరాలు పాఠశాల విద్యా కమిషనర్‌కు ఐటీ సెల్‌లో చూస్తే తెలియాలట. వచ్చే ఏడాది ‘అమ్మఒడి’ డబ్బులు ఇవ్వాలంటే ఈ ఏడాది హాజరు చాలా అవసరం అని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం తరగతుల వారీ గా ఎంతమంది పిల్లలు తిన్నారన్న వివరాలు, భోజనం చేసేటప్పుడు, చేతులు కడుక్కునేటప్పుడు, వంటగది, డైనింగ్ హాలు ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలి. మెనూ ప్రకారమే వంట చేశారా, వాటి రుచి, పరిశుభ్రత తదితర వివరాలు ఆన్‌లైన్‌లో పం పాలి. మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి నిత్యం 20 ఫొటోలు అప్‌లోడ్ చేయా లి. విద్యా కమిటీ చైౖర్మన్, వెల్ఫేర్ అసిస్టెంట్, పంచాయతీ సర్పంచ్, ఎంఈఓ, డిప్యూ టీ ఈఓలలో రోజూ ఒకరు టాయిలెట్‌ను సందర్శించినట్లు ఫొటో పెట్టాలి. పుస్తకా లు, బూట్లు, నోట్‌బుక్స్, బ్యాగులు, బెల్టు వంటివాటిని విద్యార్థుల తల్లులు వచ్చి ఐరిస్ వేస్తేనే ఇస్తారు. బూట్ల కొలతలు, విద్యార్థుల ఎత్తు, ఛాతీ కొలతలు జేవీకే యాప్ ద్వారా పంపించాలి. బియ్యం, గుడ్లు, చిక్కీల వివరాలు లెక్క చూడాలి.
చెట్లు, గుట్టల చుట్టూ ప్రదక్షిణలు
సర్వర్లు సరిగా పనిచేయక, సిగ్నళ్లు రాక గంటల తరబడి యాప్‌లు, వెబ్‌సైట్లతో నే ఉపాధ్యాయులు కుస్తీలు పడుతున్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాల్సి న సమయంలో చెట్ల వైపు, గుట్టల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పాఠశాలల్లో పరిస్థితులను చక్కదిద్దాలనే సదుద్దేశంతోనే నిత్యం యాప్‌లలో ఫొటోలు, సమాచారం న మోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆచరణలో వచ్చే ఇబ్బందుల ను ఎలా పరిష్కరిస్తారో చెప్పడం లేదు. ఈ యాప్‌ల వ్యవహారం రానురాను ఉపాధ్యాయ వర్గానికి తలనొప్పిగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదైనా సమాచారం యాప్‌లో నమోదు చేయకపోతే ఉన్నతాధికారుల నుంచి మెమోలు, షోకాజ్‌లు వస్తాయనే ఆందోళనతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లపై యాప్‌ల భారం తగ్గించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. విద్యాశాఖలో అమలు చేస్తోన్న వివిధ యాప్‌లతో విలువైన సమయం వృధా అవుతోందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.