గత ఏడాది ఫిబ్రవరిలో భీష్మతో సూపర్‌హిట్ కొట్టిన హీరో నితిన్..

మరోసారి తన లక్‌ను ఫిబ్రవరి చెక్‌తో పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. నితిన్ హీరోగా చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్యక్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం చెక్. ఈ నెల 26న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. టెర్రరిస్ట్ అనే ముద్ర పడిన ఆదిత్య అనే యువకుడు .. తనను తాన నిర్ధోషి అని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా జైలు గోడల మధ్యనే చెస్ నేర్చుకుంటాడు. ఓ ముసలి ఖైదీ(సాయిచంద్) ఆదిత్యకు చెస్‌ను బాగా నేర్పించడంతో పాటు జైలులో ఎలా ఉండాలో జాగ్రత్తలు సూచిస్తాడు. ఆయన సలహాలతో లాయర్(రకుల్ ప్రీత్ సింగ్) సపోర్ట్‌తో తను తప్పు చేయలేదని ఎలా నిరూపించుకుంటాడు? అనేదే చెక్ సినిమా కథాంశం అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్‌లో వింకీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్.. నితిన్ లవర్ పాత్రలో కనిపించింది. జైలర్ పాత్రలో సంపత్ నటించాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెనుకున్న పావుల కదిపేదెవరు? అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.