స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులోనే కాక టోటల్ దక్షిణాదిలో బన్నీకి ఫ్యాన్స్ ఉన్నారు.

ఇక స్టైలీష్ స్టార్ వచ్చాడని తెలిస్తే.. చాలు అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోతుంది. తాజాగా ఇలాంటి సీన్ తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరంలో రిపీట్ అయ్యింది. మంగళవారం రాత్రి బన్నీని చూడటానికి వచ్చిన అభిమానులతో రంపచోడవరం జంక్షన్ నిండిపోయింది.
తమ అభిమాన హీరో వచ్చాడని తెలిసి వేలాదిగా బన్నీ అభిమానులు రంపచోడవరం జంక్షన్‌కు తరలివచ్చారు. సెల్‌ఫోన్ వెలుగుల్లో బన్నీని చూసుకుని ఆనందపడ్డారు. కారు రూఫ్ టాప్‌లో నుంచి బయటికి వచ్చిన బన్నీ.. తనకోసం వేచి చూస్తున్న అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఒక ఫొటోను బన్నీ ట్వీట్ చేశారు. ‘థాంక్ యూ రంపచోడవరం’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ గత నెల రోజులుగా రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి ఆటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ మంగళవారం పూర్తయినట్టు సమాచారం. షూటింగ్ జరుగుతున్న సమయంలో అభిమానులు మారేడుమిల్లి వచ్చినా బన్నీ కలవడానికి వీలు పడలేదట. అందుకే రెండు రోజుల క్రితం మోతుగూడెం సమీపంలో కొంత మంది అభిమానులను కలిశారు. ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చేస్తుండగా దారిలో రంపచోడవరం వద్ద వేలలో పోగైన అభిమానులను కలిసి అభివాదం చేశారు.