రకుల్‌ ఫిట్‌నెస్‌ మంత్రా : ఫ్యాన్స్‌ ఫిదా

0
140
Spread the love

అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య యోగాసనాలతో కూడా బాగానే ఆకట్టుకుంటున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన రకుల్‌ ఆరోగ్యంగా ఉండాలనే ధ్యేయంతో పాటు మరింత ఫిట్‌నెస్‌ సాధించేందుకు కృషి చేస్తున్నట్టు కనిపిస్తోంది. యోగాలో అతికష్టమైన ఆసనంతో కొత్త యోగిని భామగా అవతరించారు. ఈ మేరకు ఆమె ఒక క్లిష్టమైన ఆసన​ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తెలుగు, తమిళంతోపాటు, పలు భాషల మూవీ కమిట్‌మెంట్స్ తో బిజీ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన ఫిట్‌నెస్ పోస్ట్‌లతో సందడి చేస్తోంది. తాజాగా మరో అద్భుతమైన యోగా భంగిమతో అభిమానులను ఫిదా చేశారు. ఇటీవల కోవిడ్‌-19 బారిన పడిన రకుల్‌ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు కండరాల టోనింగ్‌ కోసం రకుల్ ప్రీత్ ఈ మల్టీ డైమెన్షనల్ యోగాసనాన్ని ఎంచుకోవడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here