తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం మూణ్ణాళ్ళ ముచ్చటగానే ముగిసిపోయింది. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళలేకపోవడాన్ని ఆయనకి పరిశ్రమలో అత్యంత సన్నిహితులైనవారు మాత్రం ఎంతో పాజిటివ్‌గా తీసుకుని ఆనందిస్తున్నారు. రజనీ అంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ కొంత నిరాశపడ్డారు. మళ్ళీ వారు కూడా వాళ్ళ అభిమాన హీరో ఆరోగ్యం నిలకడగా ఉంటే చాలు, అదే పదివేలు అన్న నిర్ణయానికి చివరగా వచ్చి, రజనీ చేయబోతున్న సినిమాల ముచ్చట్లు చెప్పుకుని కాలక్షేపం చేస్తున్నారు. రజనీ తర్వాత రజనీ స్టేటస్‌కి ఎదుగుతున్న విజయ్ అభిమానులకు రజనీ సినిమాలలోనే కొనసాగే నిర్ణయం కొంచెం కొరుకుడు పడడం లేదు. రజనీ రాజకీయాలలోకి వెళ్ళిపోతే ఆ స్థానం విజయ్‌కే సొంతం అవుతుందని ఆశపడినవాళ్ళంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. రజనీ సినీ రంగంలో ఉన్నంతకాలం ఆ స్ధానాన్ని ఎవ్వరూ ఆక్రమించలేరన్న వాస్తవం అందరికీ తెలిసిందే. ఎప్పుడదైతే రజనీకాంత్ రాజకీయాలకు దూరం అన్న వార్త వెలువడిందో ఎక్కువగా సంతోషించినవారు కమల్‌హసన్ వర్గీయులు.

రజనీ రాజకీయ యుద్ధం నుంచి విరమించుకున్న తర్వాత కమల్‌హసన్‌కి కొంచెం ఊరట లభించి, డి.ఎం.కె, అన్నా డి.ఎం.కె తర్వత కమల్‌హసన్ పేరే వినిపిస్తోందట. రజనీకాంత్ ప్రస్తుతం చేస్తున్న అణ్ణాత్త
చిత్రం తర్వాత రెండు సినిమాలకు సైన్ చేశారు. కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రానికి గౌతమ్ మీనన్ దర్వకత్వం వహిస్తున్నారు. అ కథా చర్చలు జరుగుతుండగా, కార్తీక్ సుబ్బరాజు చిత్రం మరొకటి. ఈ సంవత్సరం రజనీకాంత్ సైన్ చేసిన చిత్రాలు ఈ రెండు లిస్టులో ఉన్నాయి. అణ్ణాత
తెలుగులో అన్నయ్య
గా రాబోతోంది.
మళ్ళీ టీవీలోనే రజనీ సందేశం
1996లో ఒకసారి రజనీకాంత్ డిఎంకెకి మద్దతుగా టీవీల్లో ప్రసంగిస్తే ఆ ఎన్నికలలో డి.ఎం.కెకి చాలా ఉపయోగపడింది. ఈ సారి కూడా రజనీకాంత్ మళ్ళీ అప్పటిలాగే ఈ సారి కూడా పోలింగ్ ముందు టీవీల్లోకి వచ్చి తన సందేశాన్నిచ్చి, తన ఎవరికి మద్దతు పలకబోతున్నారో చెబుతారట. అధికారికంగా దీనికి సంబంధించి ఏ సమాచారమూ బహిర్గతం కాకపోయినా, రాజకీయవర్గాల్లో మాత్రం ఈ వార్త చాలా హల్‌చల్ చేస్తోంది.