సాగర్‌ ఉప ఎన్నిక: జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

0
245
Spread the love

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నాగార్జున సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గతంలో ఇది కాంగ్రెస్‌కు కంచు కోటగా ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. నోముల నర్సింహయ్య టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో నిలబడి విజయం సాధించారు. అయితే ఆయన అకాల మరణంతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ జానా రెడ్డిని బరిలో నిలపాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మరోవైపు బీజేపీ ఆయన తనయుడు రఘువీర్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకుని.. టికెట్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు జానా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగర్‌ ఉప ఎన్నిక బరిలో తోటి అనుచరులంతా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని పోటీలో ఉంచుందాం అంటే తననే నిలబెడతామన్నారు. అలా కాదని.. తన అనుచరులు వేరే ఎవరైనా పోటీలో ఉంటాము అంటే వారికే తన మద్దతు ఉంటుంది అని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అని జానా రెడ్డి ప్రకటించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here