104వ రాజ్యాంగ సవరణ చట్టం-2000
ఇది చట్టసభల్లో (లోక్‌సభ, రాజ్యసభ) ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ కాలపరిమితిని మరో పదేండ్లపాటు కొనసాగడానికి/మరో పదేండ్లపాటు పెంచడానికి సవరణ చేశారు.
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ కాలపరితి 2020, జనవరి 25 నాటికి పూర్తికావాలి. అందుకే దీనిని 2030, జనవరి 25 వరకు (పదేండ్లు) పెంచడానికి 126వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
ఈ బిల్లును లోక్‌సభ 2019, డిసెంబర్ 10న, రాజ్యసభ డిసెంబర్ 12న ఆమోదించాయి.
రాష్ట్రపతి 2020, జనవరి 21న ఆమోదించడంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఈ చట్టం అమలు తేదీ జనవరి 25.

ప్రాతినిథ్యం
గత 70 ఏండ్లుగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు గణనీయ పురోగతి సాధించినప్పటికీ పైన పేర్కొన్న సీట్ల రిజర్వేషన్‌కు సంబంధించి నిబంధనలు చేయడంలో రాజ్యాంగ సభతో తూకం వేసిన కారణాలు ఇంకా ఉనికిలో లేవు. అందువల్ల రాజ్యాంగ నిర్మాతలు ఊహించినట్లుగా కలుపుకొని ఉన్న పాత్రను నిలుపుకోవాలనే ఉద్దేశంతో షెడ్యూల్డ్ కులాలు, తెగల సీట్ల రిజర్వేషన్లు మరో పదేండ్లపాటు కొనసాగించాలని ప్రతిపాదించారు.
ఈ సవరణ ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ కోసం కేటాయించిన రెండు లోక్‌సభ సీట్ల రిజర్వేషన్ వ్యవధిని పొడిగించదు. అందువల్ల ఈ సవరణ అమలు తేదీ నుంచి లోక్‌సభ, శాసనసభ (1 ఆంగ్లోఇండియన్ నామినేట్)ల్లో ఆంగ్లో ఇండియన్స్‌ను నామినేట్ చేసే విధానం రద్దయ్యింది.
రాజ్యాంగం-ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్స్ (చట్టసభలు)
330వ ఆర్టికల్: లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా మేరకు కొన్ని స్థానాలు రిజర్వ్ చేస్తారు. ఈ ఏర్పాటు రాజ్యాంగంలో పదేండ్ల వరకే ఉండేది.
331వ ఆర్టికల్: లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లోఇండియన్స్‌ను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
332వ ఆర్టికల్: ప్రతి రాష్ట్ర శాసనసభలో వారి జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని స్థానాలు రిజర్వ్ చేస్తారు.
333వ ఆర్టికల్: ప్రతి రాష్ట్ర శాసనసభకు ఒక ఆంగ్లో ఇండియన్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేస్తారు.
334వ ఆర్టికల్: ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్స్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి పదేండ్లపాటు కొనసాగుతాయి.
నోట్: 334వ ఆర్టికల్‌ను ఇప్పటివరకు ఆరుసార్లు సవరించి పదేండ్ల చొప్పున 2020 వరకు పొడిగించారు. ప్రస్తుతం ఏడోసారి సవరించి (104వ సవరణ) మరో పదేండ్లపాటు (2030 జనవరి 25 వరకు) పొడిగించారు.
ఈ సవరణ ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ కాలపరిమితిని మాత్రమే పొడిగించినది. అంటే ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిథ్యాన్ని (331, 333 ఆర్టికల్స్) పూర్తిగా రద్దుచేశారు.
సవరణలు-గుర్తుంచుకునే పద్ధతి
రాజ్యాంగంలో ఒకే అంశానికి సంబంధించి అనేక సవరణలు చేశారు. వాటిని కింది విధంగా గుర్తుంచుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, ఆంగ్లో ఇండియన్లకు పార్లమెంట్, శాసనసభల్లో స్థానాల రిజర్వేషన్స్ కాలపరిమితి పొడిగింపునకు సంబంధించి కింది సవరణలు చేశారు.
8వ రాజ్యాంగ సవరణ- 1960
23వ రాజ్యాంగ సవరణ- 1969
45వ రాజ్యాంగ సవరణ- 1980
62వ రాజ్యాంగ సవరణ- 1989
95వ రాజ్యాంగ సవరణ- 2009
104వ రాజ్యాంగ సవరణ- 2020
రాజ్యాంగ సవరణలు (371 ఆర్టికల్) – ప్రత్యేక ప్రతిపత్తి రాష్ర్టాలు
7వ రాజ్యాంగ సవరణ-1956 (371(1))- మహారాష్ట్ర, గుజరాత్
13వ రాజ్యాంగ సవరణ-1962 (371(1ఎ))- నాగాలాండ్
22వ రాజ్యాంగ సవరణ-1969 (371(1బి))- అస్సాం
27వ రాజ్యాంగ సవరణ-1971 (371(1సి))- మణిపూర్
32వ రాజ్యాంగ సవరణ-1973 (371(1డి), (1ఇ))- ఆంధ్ర, తెలంగాణ
36వ రాజ్యాంగ సవరణ-1975 (371(1ఎఫ్))- సిక్కిం
53వ రాజ్యాంగ సవరణ-1986 (371 (1జి))- మిజోరం
55వ రాజ్యాంగ సవరణ-1987 (371(1హెచ్))- అరుణాచల్‌ప్రదేశ్
56వ రాజ్యాంగ సవరణ-1987 (371(1ఐ))- గోవా
97వ రాజ్యాంగ సవరణ-2011 (371(జె))- కర్ణాటక రాష్ట్రంలోని హైదరాబాద్-కర్ణాటక ప్రాంత ప్రత్యేక ప్రతిపత్తి
అధికార భాషలు సింధి, కొంకణి, మణిపురి, నేపాలీ, బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలిలకు సంబంధించిన సవరణలు
21వ రాజ్యాంగ సవరణ-1967
71వ రాజ్యాంగ సవరణ-1992
92వ రాజ్యాంగ సవరణ-2003
15వ రాజ్యాంగ సవరణ: హైకోర్టు జడ్జిల పదవీవిరమణ వయస్సును 60-62కు పెంచడం.
41వ రాజ్యాంగ సవరణ: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీ విరమణ వయస్సు 60-62కు పెంచడం.
పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు సవరణలు
48వ రాజ్యాంగ సవరణ-1984
59వ రాజ్యాంగ సవరణ-1988
63వ రాజ్యాంగ సవరణ-1989
64వ రాజ్యాంగ సవరణ-1990
67వ రాజ్యాంగ సవరణ-1990
68వ రాజ్యాంగ సవరణ-1991
భూ సంస్కరణల సవరణలు
17వ రాజ్యాంగ సవరణ-1964
25వ రాజ్యాంగ సవరణ-1971
47వ రాజ్యాంగ సవరణ-1984
66వ రాజ్యాంగ సవరణ-1990
78వ రాజ్యాంగ సవరణ-1995
భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలను 9వ షెడ్యూల్‌లోకి చేర్చడం. అలాగే నష్టపరిహారం అనే పదానికి బదులు కొంత మొత్తం అనే పదం చేర్చారు.
విదేశీ ప్రాంతాల విలీనం, స్థాపన (2వ ఆర్టికల్)
9వ రాజ్యాంగ సవరణ-1960: బేరుబారి ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు బదిలీ, పాక్ నుంచి కొన్ని గ్రామాలను కూచ్‌బీహార్ ఎన్‌క్లేవ్‌లో విలీనం.
10వ రాజ్యాంగ సవరణ-1961: దాద్రానగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా భారత్‌లో విలీనం చేయడం
12వ రాజ్యాంగ సవరణ-1962: గోవా, డామన్-డయ్యూలను భారత్‌లో విలీనం
14వ రాజ్యాంగ సవరణ-1962: పాండిచ్చేరి భారత్‌లో విలీనం
35వ రాజ్యాంగ సవరణ-1975: సిక్కింకు సహరాష్ట్ర హోదా కల్పిస్తూ భారత్‌లో విలీనం
36వ రాజ్యాంగ సవరణ-1975: సిక్కింకు పూర్తి రాష్ట్ర హోదా
100వ రాజ్యాంగ సవరణ-2015: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల మార్పు. భారత్‌లోని 111 గ్రామాలు బంగ్లాదేశ్‌లో విలీనం, బంగ్లాదేశ్‌లోని 51 గ్రామాలు భారత్‌లో విలీనం.
పార్టీ ఫిరాయింపుల నిషేధ సవరణలు
52వ రాజ్యాంగ సవరణ-1985, 91వ రాజ్యాంగ సవరణ-2003: రాజ్యాంగంలో పదో షెడ్యూల్‌లో చేర్చడం, 102(2), 191(2), 75(1బి), 164(1బి) ఆర్టికల్స్ చేర్చడం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు
1వ రాజ్యాంగ సవరణ-1951: ఎస్సీ, ఎస్టీలకు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ (15(4))
77వ రాజ్యాంగ సవరణ-1995: ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లో రిజర్వేషన్ (16(4ఎ))
81వ రాజ్యాంగ సవరణ-2000: ఎస్సీ, ఎస్టీల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో క్యారీఫార్వర్డ్ అమలుకు 50 శాతం రిజర్వేషన్ మినహాయింపు
85వ రాజ్యాంగ సవరణ-2002: ఎస్సీ, ఎస్టీల ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో సీనియారిటీ నిబంధన సడలింపు (16(4-ఎ))
93వ రాజ్యాంగ సవరణ-2003: మైనారిటీయేతర ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు (15(5))
103వ రాజ్యాంగ సవరణ-2019: అగ్రకులాల్లోని బలహీనవర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం వరకు రిజర్వేషన్ (15(6), 16(6))
డీఆర్‌డీఓలో అప్రెంటిస్ ఖాళీలు
హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ-డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్)లో అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఐటీఐ అప్రెంటిస్
కోర్సు కాలవ్యవధి: 12 నెలలు
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, మెషినిస్ట్ (గ్రైండర్), మెషిన్ టూల్ మెయింటెనెన్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మెకానిక్ (ఆర్&ఏసీ), ఎలక్ట్రానిక్స్ మెకానిక్ తదితర ట్రేడులు ఉన్నాయి.
అర్హతలు: ఐటీఐలో సంబంధిత ట్రేడుల్లో ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఈ-మెయిల్ ద్వారా
ఈ-మెయిల్: [email protected]
కోర్సు ప్రారంభం: 01.04.2021 నుంచి.
చివరితేదీ: ఫిబ్రవరి 15
వెబ్‌సైట్: https://www.drdo.gov.in
పీక్స్‌ఈలో అప్రెంటిస్‌లు
ఒడిషా బాలాసోర్‌లోని డీఆర్‌డీఓ-ఫ్రూఫ్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (పీక్స్‌ఈ) డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 62
టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్- 39
విభాగాలు: సినిమాటోగ్రఫీ, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజినీరింగ్, సర్వే ఇంజినీరింగ్.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టయిఫండ్: నెలకు రూ.8000/-
టెక్నీషియన్ ఐటీఐ అప్రెంటిస్-23 ఖాళీలు
ట్రేడులు: ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్ తదితరాలు.
అర్హతలు: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ 2018, 2019, 2020లలో పూర్తి చేసినవారు.
స్టయిఫండ్: నెలకు రూ.7000/-
ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా
దరఖాస్తు: ఈ-మెయిల్ ద్వారా
ఈ-మెయిల్: [email protected]
చివరితేదీ: ఫిబ్రవరి 27
వెబ్‌సైట్: https://www.drdo.gov.in