కర్ణాటక రాసలీలల సీడీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ మంత్రి రమేష్ జార్కిహొళిపై సీడీ రూపొందించినందుకు కొందరికి భారీగా ముడుపులు అందినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో అనుమానిత వ్యక్తుల ఖాతాల్లోకి లక్షలాది రూపాయలు జమ అయినట్లు సిట్ అధికారి ఒకరు వెల్లడించారు. సీడీ వ్యవహారంలో 8 మంది పాలుపంచుకున్నట్లు గుర్తించిన సిట్ అధికారులు వీరి ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించగా నెల వ్యవధిలోనే లక్షలాది రూపాయలు జమ కావడంతో దీని వెనుక కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారు. కీలక నిందితుడు అరుణ్ సోదరుడి ఖాతాలో నెల రోజుల వ్యవధిలో రూ.40 లక్షలు జమ అయినట్లు అధికారులు గుర్తించారు.
