2012లో విడుదలైన ‘తూనీగ తూనీగ’ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన రియా చక్రవర్తి తర్వాత బాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యింది. మధ్యలో కల్యాణ్‌దేవ్ హీరోగా చేసిన సూపర్‌మచ్చి సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

సగం సినిమాలో నటించిన తర్వాత మళ్లీ బాలీవుడ్ ఆఫర్ రావడంతో సినిమాను సగంలోనే వదిలేసి వెళ్లిపోయింది. దీంతో దర్శక నిర్మాతలు ఏం చేయాలో తెలియక మరో హీరోయిన్‌ను రీప్లేస్ చేసుకుని సినిమాను రీషూట్ చేసుకున్నారు. బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేయసిగా ఉన్న సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసును సీబీఐ ప్రత్యేకంగా విచారించే సమయంలో డ్రగ్ మాఫియాకు, రియా చక్రవర్తి సహా సంజన, రాగిణి ద్వివేది వంటి వారికి సంబంధాలున్నాయని తెలియడంతో నార్కోటిక్ పోలీసులు రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. కొన్నిరోజుల పాటు రియా చక్రవర్తి జైలుకే పరిమితం అయ్యింది. సీబీఐ విచారణలో సుశాంత్ కేసు ఆత్మహత్య అని తేలింది. అదే సమయంలో నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన రియా చక్రవర్తికి ముంబై హైకోర్టు షరుతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
సుశాంత్ ఆత్మహత్యపై ముంబై మీడియా తెగ హల్‌చల్ చేసింది. ఒకానొక దశలో రియా చక్రవర్తినే దోషిగా కూడా చిత్రీకరించే ప్రయత్నాలు బలంగానే జరిగాయి. ముంబై మీడియా వర్గాల్లో సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారణ చేసేంత వరకు రియా చక్రవర్తిపై లేనిపోని కథనాలు వెలువడ్డాయి. ఎప్పుడైతే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని సీబీఐ తెలియజేసిందో అప్పుడు రియా చక్రవర్తిపై అందరిలో సానుభూతి పెల్లుబికింది. హీరోయిన్‌గా ఎదుగుతున్న క్రమంలో పలు వివాదాల్లో అనవసరంగా ఇరుక్కుందని ప్రజలు భావించారు. అయితే రియా చక్రవర్తి ఎప్పుడూ ఎవరిపై తన కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించలేదు. దీంతో పబ్లిక్‌లో రియా చక్రవర్తిపై సానుభూతి పెరిగింది.
జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన రియా చక్రవర్తి మళ్లీ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. సినిమాలు చేయడానికి తన వంతు ప్రయత్నాలను ప్రారంభించింది. సుశాంత్ ఆత్మహత్య కేసు, డ్రగ్ మాఫియా కేసు కారణంగా రియా చక్రవర్తికి తిరుగులేని పాపులారిటీ దక్కింది. సానుభూతి పెరిగింది. రియా చక్రవర్తిపై ఉన్న సానుభూతిని నిర్మాతలు ఇప్పుడు ఎన్‌క్యాష్ చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు భోగట్టా. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా నిర్మాతలు ఇప్పుడు రియా చక్రవర్తిని తమ సినిమాల్లో నటింప చేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం తెలుగులో ఇద్దరు ప్రముఖ నిర్మాతలు రియా చక్రవర్తిని తమ సినిమాల్లో నటింప చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. తెలుగు నిర్మాతల నుంచి వస్తున్న ఆఫర్‌ను రియా చక్రవర్తి తిరస్కరించలేదు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కాస్త చక్కబడ్డ తర్వాత డేట్స్ చూసుకుని తప్పకుండా చెబుతానంటూ నిర్మాతలకు రియా చక్రవర్తి మాట ఇచ్చిందని సమాచారం.