హైదరాబాద్: బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ పీఈసెట్ రెండోవిడుత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడులయ్యింది. సెకండ్‌ఫేజ్ కౌన్సెలింగ్ రేపటి నుంచి ప్రారంభమై ఈ నెల 18 వరకు కొనసాగుతుంది. సోమవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ పేమెంట్, స్కాన్ చేసిన సర్టిఫెకట్ల అప్‌లోడింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈనెల 11న రిజిస్ర్టేషన్ చేసుకున్నవారి జాబితాను ప్రకటిస్తారు. 13న సాయంత్రం 5 గంటల వరకు ఫేజ్– 2 వెబ్ ఆప్షన్లు, 14న సీట్లు పొందినవారి జాబితాను వెల్లడిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15 నుంచి 18 వరకు కాలేజీల్లో రిపోర్ట్‌చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
