‘రేషన్‌’కు బ్రేకులు!

0
174
Spread the love

 రాష్ట్రంలో రేషన్‌ పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకూ పంచాయతీ ఎన్నికలు… ఇకపై మున్సిపల్‌ ఎన్నికలు ఉండటంతో వాటి ప్రభావం పంపిణీపైనా పడుతోంది. కొత్తగా సరుకుల పంపిణీ చేపట్టిన మొబైల్‌ వాహనాల డ్రైవర్లు దాదాపుగా అందరూ అధికార పార్టీ సానుభూతిపరులు కావడంతో వారంతా ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. దీంతో డ్రైవర్లు పంపిణీని పార్ట్‌టైమ్‌ జాబ్‌లా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. చాలా వాహనాలు రో జుకు 30-40కార్డులకు మాత్రమే రేషన్‌ ఇచ్చి సరిపెడుతున్నాయి. దీంతో పేదలకు సకాలంలో రేషన్‌ అంద డం లేదు. ఇప్పటికే ఈ నెల పంపిణీ గందరగోళంగా మారగా, ఇప్పటివరకూ 36శాతం మందికి మాత్రమే సరుకులు అందాయి. రాష్ట్రంలో 1.45కోట్ల కార్డులుంటే ఇప్పటివరకూ 52లక్షల కార్డులకు మాత్రమే సరుకులు అందించారు. అది కూడా ఈ నెల 1 నుంచి పట్టణ ప్రాంతాల్లో డోర్‌ డెలివరీ చేపడితేనే ఈమాత్రం అయి నా పంపిణీ అయింది. 

ప్రభుత్వం సూచించిన విధంగా రోజుకు ఒక్కో వాహనం 90 కార్డుల చొప్పున పంపిణీ చేస్తే రోజుకు కనీసం 8లక్షల కార్డులకు సరుకులు అందాలి. కానీ ఈ సంఖ్య 6లక్షలు దాటడం లేదు. ప్రతినెలా మొత్తం కార్డుల్లో 85శాతం కార్డుదారులు సరుకులు తీసుకుంటారు. ఈ నెలలో ఇంకా 80లక్షల కార్డులకు సరుకులు అందాలి. రోజుకు 6లక్షల చొప్పున పంపిణీచేస్తే ఈ నెలలో పంపిణీ పూర్తికావడం అసాధ్యమే. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పంపిణీ ఇంకా ఆలస్యం అవుతోంది. వీటికితోడు సర్వర్‌ సమస్య, ఇతర సాంకేతిక సమస్యలతో జాప్యం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో పంపిణీ తమవల్ల కాదని డ్రైవర్లు చేతులెత్తేస్తుంటే, డీలర్లే పంపిణీ చేయాలని స్థానిక అధికారులు ఆదేశిస్తున్నారు. అయితే ఇందులో తమకెలాంటి సంబంధం లేదని డీలర్లు తేల్చి చెబుతున్నారు. కాగా, ఈ నెలలో ఇప్పటికీ రేషన్‌ ఇవ్వకపోవడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.  

మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు: డీలర్ల సంఘం

డోర్‌ డెలివరీ విధానం ప్రారంభమయ్యాక రేషన్‌ డెలివరీ బాధ్యత తమ నుంచి తొలగించారని, అందువ ల్ల డీలర్లపై ఎలాంటి ఒత్తిళ్లు చేయొద్దని రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు దివి లీలామాధవరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొన్నిచోట్ల వాహనాల డ్రైవర్లు లేనందున వీఆర్‌వో లాగిన్‌తో సరుకులు పంపిణీ చే యాలని డీలర్లపై ఒత్తిడి చేయడం సరికాదన్నారు.   డీలర్లు తమ పరిధులకు లోబడి మాత్రమే పనిచేస్తారని ఆయన స్పష్టంచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here