విశాఖశారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి భావోద్వేగానికి గురయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో గుళ్ళ సీతారామపురం ఆలయ దుస్థితి చూసి ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో స్వామీజీ నేడు గుళ్ళ సీతారామపురం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆలయానికి మూడు వేల ఎకరాలున్నా నిర్లక్ష్యానికి గురి కావడం బాధాకరమన్నారు. ఆలయ భూముల్ని అన్యాక్రాంతం చేసిన వారికి నాశనం తప్పదన్నారు. దోచుకున్న భూముల్ని అలయానికి అప్పగించాలని స్వాత్మానందేంద్ర స్వామి డిమాండ్ చేశారు. గుళ్ళ సీతారామపురం ఆలయ దుస్థితిపై దేవాదాయ శాఖతో చర్చిస్తామన్నారు. శ్రీరామనవమి వేడుకలకు విశాఖ శారదాపీఠం తరపున పట్టువస్త్రాలను పంపిస్తామన్నారు. సీతారాములకు వెండి కిరీటాలను చేయిస్తామని స్వాత్మానందేంద్ర స్వామి వెల్లడించారు.
