రత్-సౌతాఫ్రికా మహిళల మధ్య రెండో వన్డే మంగళవారం ఇక్కడ జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో ఓడిన టీమిండియా బలంగా పుంజుకొని ఈ పోరుతో విజయానికి శ్రీకారం చుట్టాలని పట్టుదలగా ఉంది. కరోనాతో ఏడాదిగా ఆటకు దూరంగా ఉండడం తొలి వన్డేలో మిథాలీసేనపై ప్రభావం చూపింది. కెప్టెన్ మిథాలీ, వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తప్ప మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. అలాగే బౌలింగ్‌లో సీనియర్ పేసర్ జులన్ గోస్వామి మినహా మిగిలినా వారెవరూ పెద్దగా రాణించలేకపోయారు. మరోవైపు అన్ని విభాగాల్లో అద్భుతంగా ఆడిన సౌతాఫ్రికా రెండో మ్యాచ్‌లోనూ అదేస్థాయిలో సత్తా చాటాలని భావిస్తోంది.

ఆరేళ్లలో తొలిసారి.. టెస్ట్ ఆడనున్న భారత మహిళలు
ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు ఆరేళ్లలో తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్‌తో ఈ ఏకైక టెస్ట్ జరగనుందని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీసీసీఐ కార్యదర్శి జై షా సోమవారం వెల్లడించాడు. అయితే కచ్చితమైన తేదీ ఖరారు కాకపోయినా..జూన్‌లో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షి్‌పనకు ముందు లేదా తర్వాతో ఇంగ్లండ్‌లో మ్యాచ్ జరగనున్నట్టు సమాచారం. మిథాలీ సేన చివరిసారి 2014లో మైసూరులో సౌతాఫ్రికాతో టెస్ట్ ఆడింది.
మహిళల్లో మరిన్ని జట్లు
ఐసీసీ టోర్నీల్లో మరిన్ని మహిళల జట్లకు చోటు లభించనుంది. 2026నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుందని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2026 టోర్నీ నుంచి టీ20 వరల్డ్ కప్‌లో 10కి బదులు 12 జట్లకు స్థానం కల్పించనున్నట్టు పేర్కొంది. 2029 వన్డే ప్రపంచ కప్‌లో జట్ల సంఖ్యను 8 నుంచి 10కు పెంచనున్నట్టు వివరించింది.