విత్తన నిర్ధారణ కేంద్రానికి శంకుస్థాపన

0
359
Spread the love

కాజీపేట, ఫిబ్రవరి 9: వరంగల్‌ జిల్లాలో మొట్టమొదటి సారిగా రూ. 1,51,85000తో విత్తన నిర్ధారణ కేంద్ర భవ నాన్ని నిర్మిస్తున్నామని తెలంగాణ స్టేట్‌ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఎస్‌డీసీ) చైర్మన్‌ కొండబాలు కోటేశ్వ ర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. మడి కొండలోని తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ డివిజన్‌ కార్యాలయంలో మంగళవారం రాత్రి వారు విత్తన నిర్ధారణ కేంద్రం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్ర భుత్వం రైతులకు అందుబాటులో విత్తన నిర్ధారణ కేంద్రం భవనాన్ని నిర్మించడం అభినందనీయమని అన్నారు.

విత్తన నిర్ధారణ కేంద్రానికి శంకుస్థాపన

త్వరలోనే అధునా తన సదుపాయాలతో నిర్మిస్తామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఎస్‌ ఎండీ, సర్టిఫికేషన్‌ డైరెక్టర్‌ కేశవులు, రీజినల్‌ మేనేజర్‌ బయ్యరాజు, ప్రొడక్షన్‌ మేనేజర్‌ జే శ్రీనివాస్‌, స్థానిక కార్పొరేటర్‌ జోరిక రమేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయ కులు దువ్వ నవీన్‌, రాజేశ్‌రెడ్డి, పోలపల్లి రామ్మూర్తి, ప్రశాంత్‌, బొల్లికొండ వినోద్‌, ఈదురు అనిల్‌, అల్లం శ్రీనివాస్‌, పల్లపు నర్సింగరావు, నరో త్తంరెడ్డి, నర్మెట భిక్షపతి, అక్షయ్‌, సురేశ్‌, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here