ఏఐఎల్‌ఈటీ2021

0
260
Spread the love

న్యాయవిద్య… పురాతనమైనది. ఇటీవల కాలంలో మరింత క్రేజీతో ఎక్కువమంది ఎంపికచేసుకుంటున్న రంగం. సాంకేతికత పెరుగుతున్నకొద్ది పలు అంశాల్లో అనేక సమస్యలు. దీనికోసం కొత్త చట్టాలు, వాటి అమలు, వివాదాలు, ఇలా అనేక సమస్యల పరిష్కారంలో న్యాయవ్యవస్థది ప్రముఖపాత్ర. అదేవిధంగా బలహీనులను బలవంతులు దోచుకోకుండా కాపాడే వ్యవస్థల్లో న్యాయస్థానాలు కీలకం. ఇటీవల కాలంలో జిల్లాస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు న్యాయస్థానాల పాత్ర పెరుగుతున్నది. లా కోర్సులు చేసిన ప్రతిభావంతులకు కార్పొరేట్‌ కంపెనీలు సైతం ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. లా కోర్సులకు పలు పేరొందిన కాలేజీలు ఉన్నాయి. వాటిలో ప్రతిష్ఠాత్మకమైనది ఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ. ఇక్కడ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏఐఎల్‌ఈటీ నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా..

ఏఐఎల్‌ఈటీ2021

ఎన్‌ఎల్‌యూ
దేశంలో ప్రతిష్ఠాత్మక న్యాయవిద్యా కళాశాలల్లో ఇది ఒకటి. నేషనల్‌ లా యూనివర్సిటీని ఢిల్లీలో 2008లో ప్రారంభమైంది. 2010లో ఎన్‌ఎల్‌యూ పూర్తిస్థాయి క్యాంపస్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ సంస్థలో ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తారు. ఈ సంస్థలో ప్రవేశాల కోసం క్లాట్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోరు.

అందించే కోర్సులు

బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌)- ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌
ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌ (ఏడాది)
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌
ఎంపిక: దేశవ్యాప్తంగా నిర్వహించే ఆల్‌ ఇండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏఐఎల్‌ఈటీ) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

నోట్‌: ఏఐఎల్‌ఈటీ స్కోర్‌ ద్వారా ఢిల్లీ ఎన్‌ఎల్‌యూతోపాటు ఉత్తరాదిన కొన్ని న్యాయకళాశాలలు ఈ స్కోర్‌తో ప్రవేశాలు కల్పిస్తాయి.

అర్హతలు: బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌) కోర్సుకు ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు వస్తే సరిపోతుంది) లేదా 2021 మార్చి/ఏప్రిల్‌లో ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీలో కనీసం 55 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 45 శాతం మార్కులతో) ఉత్తీర్ణత.

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు ఎల్‌ఎల్‌ఎంలో కనీసం 55 శాతం మార్కులతోఉత్తీర్ణత.

పరీక్ష విధానం

ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు.

ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.

పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు.

ఈ పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు. 150 మార్కులు.

నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది.

ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.

పరీక్షలో ఇంగ్లిష్‌-35, జీకే-35, లీగల్‌ ఆప్టిట్యూడ్‌-35, లాజికల్‌ రీజనింగ్‌-35, ఎలిమెంటరీ మ్యాథ్స్‌-10 మార్కులు కేటాయించారు.

రాష్ట్రంలో పరీక్ష కేంద్రం హైదరాబాద్‌లో ఉంది.

ముఖ్య తేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చివరితేదీ: మే 20

అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌: జూన్‌ 5 నుంచి

ఎంట్రన్స్‌ టెస్ట్‌ తేదీ: జూన్‌ 20 (మధ్యాహ్నం 10 నుంచి 11.30 వరకు)

వెబ్‌సైట్‌: https://nludelhi.ac.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here