‘పది’ అర్హతతో ఇండియన్‌ రైల్వేలో 480 అప్రెంటిస్‌లు

0
309
Spread the love

న్యూఢిల్లీ: ఉత్తర మధ్య రైల్వేలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 480 పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులని వెల్లడించింది. ఇందులో ఫిట్టర్‌, వెల్డర్‌, మెకానిక్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రిషన్‌ పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చేనెల 16 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పనిచేయాల్సి ఉంటుంది. 

‘పది’ అర్హతతో ఇండియన్‌ రైల్వేలో 480 అప్రెంటిస్‌లు

మొత్తం పోస్టులు: 480

ఇందులో ఫిట్టర్‌ 286, వెల్డర్‌ 11, మెకానిక్‌ (డీజిల్‌) 84, కార్పెంటర్‌ 11, ఎలక్ట్రిషన్‌ 88 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 

అర్హతలు: పదో తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి, 15 నుంచి 24 ఏండ్ల లోపువారై ఉండాలి. 

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులను ట్రైనింగ్‌కు ఎంపికచేస్తారు. 

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు: రూ.170, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.70

దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 16

వెబ్‌సైట్‌: www.ncr.indianrailway.gov.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here