న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 89 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం), మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది.

మొత్తం పోస్టులు: 89
ఇందులో ఏజీఎం 87 (జనరల్ అడ్మినిస్ట్రేషన్ 30, టెక్నికల్ 27, అకౌంట్స్ 22, లా 8), మెడికల్ ఆఫీసర్ 2 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతోపాటు పీజీ చేసి ఉండాలి. మెడికల్ ఆఫీసర్, ఏజీఎం (లా) పోస్టులకు అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000
అప్లికేషన్లు ప్రారంభం: మార్చి 1
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31
రాపరీక్ష: మే లేదా జూన్‌లో
వెబ్‌సైట్: www.fci.gov.in