బార్ కౌన్సిల్ పరీక్ష (ఏఐబీఈ) వాయిదా పడింది. ఈ విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఒక అధికార ప్రకటనలో వెల్లడించిది. ఆలిండియా బార్ పరీక్షకు కొత్త షెడ్యూల్ ప్రకటించడంతోపాటు పరీక్షకు దరఖాస్తు దాఖలు తేదీని కూడా పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ పరీక్ష వచ్చే నెల 21 న జరుగాల్సి ఉన్నది.

సవరించిన షెడ్యూల్ ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 2021 ఏప్రిల్ 25 న ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తుందని పేర్కొన్నది. మార్చి 21 న జరుపతలపెట్టిన పరీక్షను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా వేశారు. దీనితో పాటు బీసీఐ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవలసిన చివరి తేదీని కూడా పొడిగించారు. పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఇప్పుడు 2021 మార్చి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఆన్‌లైన్ ఫారం నింపడానికి చివరి తేదీ 2021 మార్చి31. పరీక్షకు అడ్మిట్ కార్డులు 2021 ఏప్రిల్ 10 న జారీ చేయబడుతుంది. అంతకుముందు దరఖాస్తు దాఖలుకు చివరి తేదీని ఫిబ్రవరి 26 గా ప్రకటించారు.