న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 70 ప్రాజెక్ట్ ఇంజినీర్, ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ అప్లికేషన్లు నేటి నుంచే ప్రారంభమయ్యాయి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

మొత్తం పోస్టులు: 70
ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్ 55, ప్రాజెక్ట్ ఆఫీసర్ 15 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, ఎంబీఏ, పీజీ డిప్లొమాలలో ఏదైనా ఒకటి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 28 ఏండ్లలోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుల ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.300
అప్లికేషన్స్ ప్రారంభం: మార్చి 12
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31
వెబ్‌సైట్: bdl-india.in