హైదరాబాద్: ఓయూ పరిధిలోని పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్టు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ ఎన్ కిషన్ తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లోని వివిధ దవాఖానల సమన్వయంతో ఓయూ ఫిజిక్స్ విభాగం ఈ కోర్సు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాల్లో 60 శాతం మార్కులతో పాసైన వారు అర్హులని వివరించారు. వివరాలకు www.ouadmissions.com చూడాలని సూచించారు.

పరీక్ష ఫీజు గడువు 19
ఓయూ పరిధిలోని పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ పరీక్ష ఫీజును ఈ నెల 19వ తేదీలోగా కళాశాలల్లో చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ సూచించారు.