పవన్ కళ్యాణ్ సినిమా అంటే దర్శకుడి విషయంలో ఎన్నో చర్చలు సాగుతాయి. టాలెంట్ ఉంటేగాని అవకాశం దక్కదు. ఎందుకంటే ఆయన పవర్ స్టార్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే పెద్ద డైరెక్టర్ అయినా ఉండాలి..లేదా మంచి ఫాంలో ఉన్న దర్శకుడైనా కావాలి. ఇక మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ సినిమా అంటే అభిమానుల్లో..ప్రేక్షకుల్లో పెద్ద దర్శకుడనే అనుకుంటారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడు..స్టార్ డైరెక్టర్ త్రివిక్రం అని కొందరు ఫిక్సవుతారు కూడా. లేదంటే రెండవ ఆప్షన్‌గా హరీష్ శంకర్ అని మాట్లాడుకుంటారు. కానీ ఫాంలో లేని వేణు శ్రీరాం వకీల్ సాబ్ సినిమాకి డైరెక్టర్ అని మాత్రం ఏ ఒక్కరు అనుకోరు.

అయితే పవన్ కళ్యాణ్ చర్యలు ఊహాతీతం.. అంచనాలని తలకిందులు చేసే నిర్ణయాలు తీసుకుంటుంటాడు. అదే వకీల్ సాబ్ సినిమాకి జరిగిందనుకోవచ్చు. దిల్ రాజు – బోనీ కపూర్ లాంటి పెద్ద నిర్మాతలైనా పవన్ కళ్యాణ్ నో అంటే మరో మాట మాట్లాడే అవకాశం ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ హార్డ్ వర్క్6ని నమ్ముతాడు. అలానే జస్ట్ రెండంటే రెండు సినిమాలు చేసిన దర్శకుడు వేణు శ్రీరాంని నమ్మి వకీల్ సాబ్ సినిమా అవకాశం ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వేణు శ్రీరాం నిలబెట్టుకున్నాడని ఇటీవల రీలీజైన కంటి పాట్ సాంగ్ అంతక ముందు రిలీజైన సత్యమేవ జయతే.. టీజర్స్ తో తెలుస్తోంది.
బాలీవుడ్ పింక్ కథలో లేని కమర్షియల్ అంశాలు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లో చేర్చాడు వేణు శ్రీరాం. ఫైట్స్, సాంగ్స్ అంటూ పవన్ ఇమేజ్‌ని దృష్ఠిలో పెట్టుకోవడంతో పాటు ఫ్యాన్స్ ఆయనని ఎలా చూడాలనుకుంటారో అలా వకీల్ సాబ్‌ని రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమనౌలు బాగా సంతృప్తి చెందినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఒక్క పవన్ అభిమానులను మాత్రమే ఒప్పించి మెప్పిస్తే సరిపోతుందా.. ప్రేక్షకులు కూడా ఉన్నారు కదా..మరి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది..వారు ఇదే ఫీడ్ బ్యాక్ ఇస్తారా అన్నది వకీల్ సాబ్ రిలీజయ్యాక గాని తెలియదు. చూడాలి మరి దర్శకుడిగా వేణు శ్రీరాంకి వకీల్ సాబ్ ఎలాంటి అనుభవాన్నిస్తుందో.