వేతన జీవులకు నిరాశే!

0
208
Spread the love

కేంద్ర బడ్జెట్‌ వేతన జీవులను నిరాశపరిచింది. ప్రధానంగా.. ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లేకపోగా.. దొడ్డిదారి బాదుడుకు రంగం సిద్ధం చేసింది. ఆదాయపన్ను శ్లాబులు మారుతాయని, ‘పన్ను’పోటు కొంతైనా తగ్గుతుందని భావించిన సామాన్య వేతన జీవులకు తీవ్ర నిరాశ ఎదురైంది.

ఆదాయపన్ను కొత్త రిటర్న్స్‌ విధానానికి మారిన వారు కూడా.. ఎన్నో ప్రోత్సాహకాలు ఉంటాయని భావించి, భంగపడ్డారు. గృహ రుణాలపై వడ్డీకి ఆదాయపన్నులో అదనంగా ఇస్తున్న రూ. 1.5 లక్షల మినహాయింపును ఏడాదిపాటు కొనసాగించడం, పీఎఫ్‌ విషయంలో యాజమాన్యాల వైఖరికి కళ్లెం వేసే చర్యలను చేపట్టడం.. 75 ఏళ్లు పైబడిన వారిని ఐటీఆర్‌ నుంచి మినహాయిండం వంటి కంటితుడుపు చర్యలు.. కొంత వరకు ఊరటనిస్తున్నాయి.
75 ఏళ్లు దాటిన వారికి..
పెన్షన్‌, బ్యాంకు వడ్డీలే ఆదాయంగా ఉండి.. 75ఏళ్లు దాటిన వారు ఇకపై ఆదాయపన్ను రిటర్న్స్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేదని నిర్మల పేర్కొన్నారు. ఇతరత్రా మార్గాల్లో ఆదాయం వచ్చేవారికి ఇది వర్తించదు.
గృహ రుణాలున్న వారికి కాస్త ఊరట!
గృహ రుణాలు తీసుకున్న వారు చెల్లిస్తున్న వడ్డీపై రూ. 1.50 లక్షల అదనపు ఆదాయపన్ను మినహాయింపును వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగిస్తామని నిర్మల ప్రకటించారు. గృహ రుణాలకు సంబంధించిన వడ్డీపై ఇంతకు ముందు రూ. 2 లక్షల వరకు ఆదాయపన్నులో మినహాయింపు ఉండేది. 2019 బడ్జెట్‌లో దానికి మరో రూ. 1.50 లక్షలను చేర్చారు. అది కూడా రూ. 45 లక్షల లోపు గృహరుణం తీసుకున్న వారికే. ‘అందరికీ అందుబాటులో ఇళ్లు’ అనే లక్ష్యసాధనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది కూడా గృహ రుణాలు తీసుకున్న వారు రూ. 3.50 లక్షల వరకు ఆదాయపన్నులో మినహాయింపు పొందవచ్చని నిర్మల పేర్కొన్నారు. కరోనా కల్లోలంతో కుదేలైన గృహనిర్మాణ రంగానికి ఈ నిర్ణయం ఊతమిస్తుందని ఆమె చెప్పారు. అయితే.. కరోనా కల్లోలం తర్వాత గృహ రుణాల వడ్డీ రేట్లు బాగా తగ్గిన నేపథ్యంలో.. ఈ వెసులుబాటుతో పెద్దగా ఊరట లభించే అవకాశాలు తక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. బడ్జెట్‌ ఇళ్లు నిర్మించే వారికి, వలస కార్మికులు భరించగలిగేలా అద్దె ఇళ్ల ప్రాజెక్టులు చేపట్టే వారికి 2022 మార్చి 31 వరకు ‘ట్యాక్స్‌ హాలిడే’ని ప్రకటిస్తున్నామని నిర్మల పేర్కొన్నారు.

పీఎఫ్‌ ఆలస్యమైతే.. యాజమాన్యాలకు ఇబ్బందే

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) చెల్లింపుల విషయంలో కొన్ని యాజమాన్యాలు ఉద్యోగి వాటాను జీతంలోంచి వసూలు చేస్తాయి. తమ వాటాతో కలిపి.. తీరిగ్గా ఈపీఎ్‌ఫవోలో జమ చేస్తాయి. మరికొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా వాటిని జమచేయవు. దీంతో.. ఉద్యోగికి వడ్డీ, ఇతరత్రా లబ్ధి విషయంలో నష్టం జరుగుతోంది. సంస్థలు, కంపెనీలు మూతపడ్డ సందర్భాల్లో ఉద్యోగి ఖాతాలోకి ఆ మొత్తం పడే అవకాశాలే లేవు. దీనిపై ఫిర్యాదులు రావడంతో.. కీలక నిర్ణయం తీసుకున్నట్లు నిర్మల ప్రకటించారు. ‘‘ఇకపై ఉద్యోగుల పీఎ్‌ఫను జమచేయడంలో ఆలస్యం చేస్తే.. ఆయా సంస్థలు ఉద్యోగులందరికీ చెల్లించే పీఎ్‌ఫను ఖర్చు కింద పరిగణించబోం’’ అని పేర్కొన్నారు. అంటే.. ఆయా సంస్థలు ఉద్యోగులకు చెల్లించే పీఎఫ్‌ మొత్తానికి కూడా ఆదాయంగా పరిగణిస్తూ.. పన్ను కట్టాల్సి ఉంటుంది. ఉద్యోగులకు, కార్మికులకు సంబంధించిన ఈఎ్‌సఐ వంటి ఇతర సామాజిక భద్రత పథకాల చెల్లింపుల విషయంలోనూ యాజమాన్యాలకూ ఇది వర్తిస్తుందని ఆమె చెప్పారు.

పీఎఫ్‌ ఏడాదికి రూ. 2.5 లక్షలు దాటితే వడ్డీపై పన్ను

అధికాదాయం ఉన్నవారు.. భవిష్యత్‌పై ముందుచూపుతో వ్యవహరించే ఉద్యోగులను ఈ బడ్జెట్‌ నిరాశపరిచింది. ఏడాదికి ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌ వంటి ఇతర పీఎ్‌ఫల రూపంలో వ్యక్తిగతంగా రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసేవారు.. ఆ మొత్తంపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిర్మల పేర్కొన్నారు. మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాదారుల్లో ఈ కేటగిరీకి చెందినవారు 1ు కంటే తక్కువే ఉంటారని వివరించారు. అదేవిధంగా.. యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ (యూఎల్‌ఐపీ)కి ఏడాదికి రూ. 2.5 లక్షలకు మించి చెల్లించేవారికి కూడా.. ఆయా స్కీమ్‌లు పూర్తయ్యాక వచ్చే ఆదాయాన్ని కేపిటల్‌ గెయిన్‌ కింద పరిగణిస్తారు. ఆ మొత్తంపై వడ్డీ వేస్తారు. ఇంతకు ముందు వివిధ పీఎ్‌ఫలు, యూఎల్‌ఐపీలకు చెల్లించిన మొత్తంలో రూ. 7.5 లక్షల వరకు ఆదాయపన్నులో మినహాయింపు పొందే వెసులుబాటు ఉండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here