వైఎస్సార్‌సీపీ నుంచి కొయ్యా ప్రసాద్‌రెడ్డి సస్పెన్షన్‌

0
443
Spread the love

తాడేపల్లి : విశాఖపట్నానికి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొయ్యా ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. విశాఖ కలెక్టరేట్ పేరును, రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి పేరును ఉపయోగించి ల్యాండ్ డీల్స్ పేరుతో అక్రమ కార్యకలాపాలను నిర్వహించడం పార్టీ క్రమశిక్షణ సంఘం తీవ్రంగా పరిగణించింది. అందుకే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును, పార్టీలోని పార్లమెంట్‌ సభ్యులు, సీనియర్ నాయకుల పేర్లను ఉపయోగించి భూములు, ఇతరత్రా డీల్స్ అంటూ.. ఎవరు అక్రమాలకు ఒడిగట్టినా ఇదే స్థాయిలో క్రమశిక్షణా చర్యలు ఉంటాయని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here