అక్కినేని నాగార్జున నటించిన తాజా సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించాడు. మ్యాట్నీ ఎంటర్మమెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ సినిమాతో అహిషోర్ సోల్‌మన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ దియా మీర్జా నాగార్జునకి జంటగా నటించగా సయామీ ఖేర్ మరో ముఖ్యపాత్రలో కనిపించబోతోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచాయి. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉండగా కరోనా లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ చేసుకొని రిఒలీక్ రెడీ కానున్న ఈ సినిమా ట్రైలర్‌ని మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా నాగార్జున తన విశ్వరూపం చూపించాడు. నాగార్జున కెరీర్‌లో ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ చేయడంతో అభిమానులు కొత్తగా ఫీలవుతున్నారు. ఇక ఈ నాగార్జునకి వైల్డ్ డాగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అందరు నమ్మకంగా ఉన్నారు. అందుకు కారణం వైల్డ్ డాగ్ ట్రైలర్ చూస్తుంటే నాగార్జున దేశం కోసం ప్రాణాలను కూడా లెక్కచేయని అధికారిగా కనిపించడం. అంతేకాదు ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం దియా మిర్జా .. ‘మీడిపార్ట్‌మెంట్‌కి మీడియాకి వైల్డ్ డాగ్ అయిండొచ్చు.. నాకు కాదు’ అన్న డైలాగ్‌తో తెలుస్తోంది. ఇక నాగార్జున విజయ్ వర్మగా యంగ్ లుక్‌తో అదరగొట్టాడు. ఇక ఈసినిమా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.