వివాహం తర్వాత కూడా సమంత జోరు కొనసాగుతూనే ఉంది.

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ తారస్థాయిలో ఉంది. రెగ్యులర్‌గా అప్‌డేట్స్ ఇస్తుండడమే దానికి కారణం. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 1.50 కోట్లను దాటింది. దీంతో సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
ఇప్పుడే షూటింగ్ పూర్తి చేశాను. నాకో సర్‌ప్రైజ్ వచ్చినట్టు తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ ఫాలోవర్స్. లైక్‌లు, కామెంట్లతో నన్ను ఎంతో ప్రోత్సహించిన నా ఇన్‌స్టాగ్రామ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. మరింత ఉన్నతంగా పని చేయాలనే స్ఫూర్తిని కలిగించారు. లవ్యూ ఆల్
అని సమంత పేర్కొంది.