సహ విద్యార్థిని నగ్న వీడియో చిత్రీకరించి, ఆపై

0
224
Spread the love

ముంబై: ‘అపరిచిత’ వ్యక్తితో సోషల్‌ మీడియా పరిచయం ఓ బాలికకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. స్నేహితుడిలా భావించి చెప్పినట్లా ‘ఆడి’నందుకు బాధితురాలిగా మార్చింది. ఎట్టకేలకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించగా.. ఊహించని షాక్‌ తగిలింది. తన నగ్న వీడియోలు చిత్రీకరించింది తోటి విద్యార్థే అని తెలుసుకుని ఆమె కంగుతింది. వివరాలు.. ముంబైకి చెందిన 14 ఏళ్ల విద్యార్థిని, తనతో పాటు కలిసి చదువుకుంటున్న విద్యార్థి ప్రవర్తన నచ్చక అతడి అకౌంట్‌ను బ్లాక్‌ చేసింది. దీంతో అతడు వేరే అకౌంట్‌ ద్వారా ఆమెకు ఫ్రెండ్‌ రిక్వెస్టు పంపాడు. తరచుగా మెసేజ్‌లు చేస్తూ తనను స్నేహితుడిగా అంగీకరించాలని కోరాడు. ఇందుకు ఆమె సరేనంది. అలా కొన్నాళ్లపాటు వారి స్నేహ బంధం సజావుగా సాగింది.

Mumbai Boy Booked For Recording Schoolmate Obscene Video

అయితే ట్రూత్‌ ఆర్‌ డేర్‌ గేమ్‌ ఆడదామంటూ బాలికను అతడు బలవంతపెట్టాడు. వ్యక్తిగత విషయాలు పంచుకోవడంతో పాటుగా, ధైర్యం ఉంటే దుస్తులు విప్పి తన ముందు నిల్చోవాలని చెప్పాడు. తను మాత్రం స్క్రీన్‌ మీద కనపడకుండా బాలిక వీడియోను రికార్డు చేశాడు. ఆ తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. తను అడిగినప్పుడల్లా అదే విధంగా చేయాలని, లేదంటే సదరు వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానని బెదిరించాడు. అయితే, కొన్నాళ్లపాటు అతడి మాటలు విన్న బాలిక, ఎట్టకేలకు అతడిని బ్లాక్‌ చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ బాలుడు, బాధితురాలి స్నేహితులకు ఆ వీడియోను షేర్‌ చేశాడు. ఈ క్రమంలో ఆమె పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. ఐపీ అడ్రస్‌తో అతడిని కనిపెట్టారు. మొదటి తప్పుగా భావించి, పోలీసులు అతడికి వార్నింగ్‌ ఇచ్చారు. చార్జిషీట్‌ దాఖలు చేసే సమయంలో పిల్లల కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here