సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పాదయాత్ర

0
199
Spread the love

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యే తోపుదుర్తి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు.పేరూరు డ్యామ్‌కు ఒక టీఎంసీ నీటిని ప్రభుత్వం కేటాయించింది. కర్ణాటకలోని నాగలమడక నుంచి పేరూరు వరకు 28 కి.మీ పాదయాత్ర చేపట్టారు. ఎంపీ మాధవ్‌, ఎమ్మెల్యే తోపుదుర్తి పాదయాత్రకు రైతులు మద్దతు తెలిపారు.

వైఎస్సార్‌ చలువతోనే ‘పేరూరు’కు నీళ్లు
వైఎస్సార్‌ చలువతోనే పేరూరు డ్యాంకు కృష్ణా జలాలు త రలి వచ్చాయని రోడ్లు, భవనాలశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ చెప్పారు. రెండు దశాబ్దాలుగా నీళ్లులేక ఒట్టిపోయిన పేరూరు డ్యాంకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక టీఎంసీ నీళ్లు కేటాయిస్తూ జీవో ఇచ్చారు. దీంతో అధికారులు హంద్రీనీవా నుంచి గొల్లపల్లి రిజర్వాయర్‌ ద్వారా తురకలాపట్నం మీదుగా నాగలమడక చెక్‌డ్యాం వరకు, అక్కడి నుంచి పేరూరు డ్యాంకు నీటిని తరలిస్తున్నారు.

MP Gorantla Madhav And MLA Thopudurthi Prakash Reddy Padayatra - Sakshi

అనంతపురం జిల్లా సరిహద్దులోని నాగలమడక ఉత్తర పినాకిని నది వద్ద కృష్ణా జలాలకు గురువారం మంత్రి శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తదితరులు గంగపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు రూ.5,800 కోట్లు కేటాయిస్తే.. చంద్రబాబు హామీలిచ్చి రైతులను మోసం చేశారని ఆరోపించారు. కృష్ణా జలాలను నాగలమడక మీదుగా పేరూరు డ్యాంకు తరలించడానికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ కృష్ణా నీటిని నాగలమడక మీదుగా పేరూరు డ్యాంకు చేర్చడానికి టీడీపీ అడ్డుపడిందని, అయినా ప్రకాశ్‌రెడ్డి కృత నిశ్చయంతో నీటిని తరలించారని కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here