ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలను నిర్వహించేలా చర్యలను తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఙప్తి చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 5న చేస్తున్న భూమి పూజ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయని.. ప్రజలు చిరకాల వాంఛ అయోధ్యలో రామాలయం నిర్మాణం అన్నారు.
ఆగస్టు 5న అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రమం రోజు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆద్వర్యంలోని 24 వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. భూమి పూజ కార్యక్రమాన్ని టీటీడీ ఆద్వర్యంలో నడుస్తున్న ఎస్వీబీసీ ఛానల్‌లో భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలి అన్నారు. ఇటీవల కూడా రఘురామ ఓ లేఖ రాశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం కూడా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.