సుశాంత్‌ని వాడే ఫినిష్‌ చేశాడు.. పేరు బైట పెడతాను

0
368
Spread the love

మాజీ ప్రియుడి మీద బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ కంగనా రనౌత్‌ నిప్పులు కక్కుతోంది. బూతులొక్కటే తక్కువ. పగ సాధిస్తా టైపులో, వదల బొమ్మాళి నిన్నొదలా అంటూ మాజీ ప్రియుడి మీద సెగలు చిమ్ముతోంది. కంగనా ఎప్పుడూ సైలెంట్‌ కాదు.. ఎప్పుడూ వైలెంటే. నోరిప్పిందంటే ఎవరికొ ఒకరికి మూడిందనమాటే. గొప్ప ధైర్యంగా, బోల్డ్‌గా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో కంగనాను మించిన స్టార్‌ కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే లేదు. చాలా తెలివిగా, చాలా లీగల్‌గా కూడా టార్గెట్‌ చేసిన వారిమీద దండెత్తగలదు కంగనా. అందుకే కంగనా అంటే ఫైర్‌బ్రాండ్‌ అనే పేరొచ్చింది. మొన్నీ మధ్యే ట్విట్టర్‌ సిఇవోని కడిగి పారేసింది. నన్ను వదిలేయ్ తల్లోయ్‌.. అని సదరు సిఇవో ప్రార్థిస్తేగానీ శాంతించలేదు కంగనా.

ఇప్పుడు కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌ మీదకి దండెత్తింది. అదీ మాజీ ప్రియుడికి సంబంధించిన వ్యవహారాన్ని ఈసారి ఆధారంగా తీసుకుని కంగనా చెలరేగిపోయింది. తన పరువు ప్రతిష్టని మంటగలపడానికే కొందరు నడుం కట్టారని, అటువంటివారిని వదలిపెట్టే పనే లేదని సోషల్‌ మీడియా ద్వారా స్పష్టం చేసింది. చేస్తూ.. కొందరు పెయిడ్‌ కాంపైన్‌కి బానిసలుగా మారి తన మీద బురద జల్లుతున్నారని, వారెవరో తనకి తెలుసునని కొపంతో రగిలిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయర్స్‌ని 5 లక్షలకి తగ్గించడానికి బాగా డబ్బు ఖర్చుపెట్టారని, అటువంటివారిని తప్పనిసరిగా రచ్చకీడుస్తా అని తీవ్రస్వరంతో హెచ్చరించింది. అసభ్యకరమైన మీమ్స్, అన్యాయమైన సమాచారం తనని గురిపెట్టి చాలా ఖర్చుపెట్టి మరీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఏకరువు పెడుతోంది.

ఎందుకంటే ఎలాగూ ఫాలోయర్స్ తగ్గిపోయేట్టు ఓ పథకం ప్రకారం వ్యూహం పన్నుతున్నారు కాబట్టి అభిమానుల వల్ల పెద్ద బెడద ఉండదని ధీమాగా ఉన్నారని.. ఫాలోకాని వాళ్ళకు ఎలాగూ తెలియదు కాబట్టి ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నవాళ్ళెవరో తనకి బాగా తెలుసు అని కంగనా ఊదరగొట్టేస్తోందిప్పడు. నా వెనుక ఉన్న టీమేమీ తక్కువది కాదు.. అన్ని విషయాలను ఆరా తీస్తున్నారు. రేపోమాపో అన్నీ వెల్లడవుతాయి.. ఎవరికి ఎవరు ఎంతెంత ఎర వేస్తున్నారు.. ఆ ఫేక్‌ కంపెనీలు ఎక్కడివి, ఎవరివి? ఈ మీమ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి.. ప్రతీ ఒక్క విషయం బైటకు తెస్తుంది నా టీమ్‌ అంటూనే.. అయితే నాకు తెలియక కాదు ఆ పని ఎవరు చేస్తున్నారో.. కాకపోతే అధికారికంగా బైటపడినప్పడు ఆ విలువ వేరేగా ఉంటుంది కదా.. అని మళ్ళీ సన్నాయి నొక్కు నొక్కింది కంగనా మేడమ్. సరైన టైమ్‌ కోసం ఎదురు చూస్తోందట ఈ సివంగి.

అక్కడితో ఆగిపోలేదు కంగనా.. మరో ట్వీట్‌తో అందరికీ షాకిచ్చింది. ఇటువంటి నీచమైన వ్యవహరం ఎవడు నడుపుతున్నాడో నాకు తెలుసు. నాకో పనికిమాలిన ప్రేమికుడున్నాడు. వాడితో నాకు కొన్నాళ్లు సంబంధం ఉంది. సంబంధాలే.. వాడొక్క పిల్లని కూడా పెళ్ళి చేసుకోడు. ఎందుకంటే వాడి బీరువానిండా లెక్కలేనన్ని అస్థిపంజరాలుంటాయి. మనం ఆనందంగా, హాయిగా ఉంటే ఆ మాఫీయా ర్యాకెట్‌ విడిచిపెట్టదు. వాడే సుశాంత్‌ని కూడా ఫినిష్ చేశాడు. త్వరలోనే అన్నీ మీ ముందర పెడతాను.. అంటూ భయపెడుతోంది. ఇవ్వాళే కంగనా తన బ్రేక్‌ఫాస్ట్‌ ఫొటో ఒకటి రిలీజ్‌ చేసింది. తనకి ఫుడ్‌ తప్ప మరేమీ పట్టదని ఫైనల్‌గా తేల్చి పారేసింది. సమ్మర్‌లో సాఫ్ట్‌గా ఉండే ఫుడ్‌నే నేను ఎక్కువ ఇష్టపడతాను. ఆర్గానిక్‌ హనీ, ప్రూట్స్‌, డ్రైఫ్రూట్స్‌తోనే నా బ్రేక్‌ఫాస్ట్.. అంటూ రిలీజ్‌ చేసిన ఫోటోని ఫాలోయర్స్ వీరలెవెల్లో ట్రెండింగ్‌ చేస్తున్నారు. అదీ సంగతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here