సుశాంత్ మృతి కేసులో కీలక మలుపు.. సందీప్‌పై అనుమానాలు?

0
419
Spread the love

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో రోజుకో మలుపు చోటుచేసుకుంటోంది. తాజాగా, ఫిల్మ్ మేకర్ సందీప్ ఎస్ సింగ్ కాల్ రికార్డ్స్ బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. ‘ఇండియా టుడే’ వీటిని సంపాదించింది. దాని కథనం ప్రకారం.. సందీప్ మీడియాతో మాట్లాడిన ప్రతిసారీ సుశాంత్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెబుతుండేవాడు. అంత దగ్గరి స్నేహితుడని చెప్పే సందీప్ గత 12 నెలల కాలంలో ఒక్కసారి కూడా సుశాంత్‌కు కాల్ చేసింది లేదని కాల్ రికార్డ్స్ ద్వారా తెలుస్తోంది. దీనిని బట్టి అతడి మాటలకు, చేతలకు పొంతన లేదన్న విషయం బయటపడింది

జూన్ 14న సుశాంత్ చనిపోయిన తర్వాత సందీప్ ఎస్ సింగ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. సుశాంత్ ఇంటి వద్ద పోలీసు వ్యవహారాలు చూసుకున్నాడు. సుశాంత్ పోస్టుమార్టం జరిగిన కూపర్ ఆసుపత్రిలో ఫార్మాలిటీస్ పూర్తిచేశాడు. అంబులెన్స్‌లోనూ కూర్చున్నాడు. అంత్యక్రియలకు హాజరయ్యాడు. సుశాంత్‌తో తనకున్న స్నేహం గురించి మీడియాకు వివరించాడు.

Sushant case

సుశాంత్ మరణం తర్వాత తన సినిమా ‘వందే భారతం’ పోస్టర్‌ను షేర్ చేశాడు. ఈ సినిమాలో సుశాంత్‌ హీరో. ఇప్పుడీ సినిమాను సుశాంత్ జ్ఞాపకంగా పూర్తిచేసి విడుదల చేయాలని నిర్ణయించాడు.

దశాబ్దం క్రితం సుశాంత్ సింగ్, అతడి గాళ్ ఫ్రెండ్ అంకిత లోఖండేతో కలిసి ఉండేవాడు. అయితే, గత 12 నెలలుగా సుశాంత్‌కు ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సుశాంత్ మరణించిన 5 రోజుల తర్వాత అంటే జూన్ 19న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన భావోద్వేగ పోస్టును షేర్ చేశాడు. సుశాంత్‌ను అంకిత ఎలా సేవ్ చేసిందీ అందులో రాసుకొచ్చాడు. వారిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకునేవాడినని పేర్కొన్నారు.

అయితే, సుశాంత్ కుటుంబ సభ్యుల కథనం మరోలా ఉంది. సందీప్ ఎస్ సింగ్ ఎవరో తమకు తెలియదని, సుశాంత్‌కు అతడు దగ్గరి స్నేహితుడన్న విషయం తమకు ఏమాత్రం తెలియని పేర్కొన్నారు. సుశాంత్ సిబ్బంది కూడా సందీప్ గురించి తమకు తెలియదని చెప్పడం గమనార్హం. ఇప్పుడు కాల్ రికార్డ్స్ మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

కూపర్ ఆసుపత్రికి సందీప్ ఎందుకెళ్లాడు? లేదంటే, ఇంకెవరైనా అతడిని పంపి ఉంటారా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికైతే ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ప్రస్తుతం సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానీ, కుక్ నీర్ సింగ్‌లను ఈ రోజు (మంగళవారం) మరోమారు ప్రశ్నించిం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here