తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాతి రత్నాలు’ సినిమా సంచనలం సృష్టిస్తోంది. రిలీజ్‌కి ముందు ‘జాతి రత్నాలు’ సినిమా మీద అంచనాలు ఉన్నప్ప్టటికీ ఇంతటి ఘన విజయం సాధిస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన అడ్వాన్సులన్ని కలెకన్స్ రూపంలో రిటర్న్స్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేదంతా ఓవర్ ఫ్లోస్ మాత్రమే. ఈ మధ్య కాలంలో ఇంత క్రేజ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా అని జాతి రత్నాలు సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారట. అంతేకాదు సంబరాలు చేసుకుంటున్నట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇలాంటి సినిమాని తీయాలంటే కేవలం ఒక్క ‘స్వప్న సినిమా’ బ్యానర్ వల్లే సాధ్యం అని మరోసారి ప్రూవ్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా పెద్ద పెద్ద స్టార్స్ లేకుండా కూడా ఊహించని విజయం అందుకోవడంలో ‘స్వప్న సినిమా’ సినిమా నిర్మాతలు తమ సత్తాని మరోసారి చాటుకున్నారు.

ముందు నుంచి కూడా స్వప్న సినిమా నిర్మాతలు చేసేది ప్రయోగమే అని చెప్పాలి. ఎలాంటి క్రేజ్ లేని వాళ్ళతో సినిమా తీసి ఇండస్ట్రీలో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం లాంటి సినిమా తీయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అప్పటికి విజయ్ దేవరకొండ ఎవరో పెద్దగా ఎవరికీ తెలీదు. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఎవడే సుబ్రమణ్యం లాంటి సినిమాలు తెలుగులో రావడం చాలా అరుదు. ఎవరెస్టు శిఖరంపై చిత్రీకరణ జరుపుకున్న మొదటి తెలుగు చిత్రంగా ఎవడే సుబ్రమణ్యంకి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమా తర్వాత ఇదే నిర్మాణ సంస్థ నుంచి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి జీవిత కథను కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో ‘మహానటి’గా నిర్మించారు. ఈ సినిమా కూడా ఒక పెద్ద సాహసం అని చెప్పాలి. నాగ్ అశ్విన్ రెండవ సినిమాతో ఏకంగా అలనాటి స్టార్ హీరోయిన్ ‘సావిత్రి’ కథ ని వెండి తెరమీద ఆవిష్కరించాలనుకున్న ప్రయత్నం విజయవంతం అయింది. ఈ సినిమాతో ‘స్వప్న సినిమా’ సంస్థ యొక్క ఘనత ఇండస్ట్రీలో విపరీతంగా పెరిగింది.
ఈ సినిమా సమయానికి కూడా కీర్తి సురేష్ కొన్ని కమర్షియల్ హిట్స్ ఉన్నాయి గాని బయోపిక్‌లో టైటిల్ రోల్ చేయగలిగేంత క్రేజ్ మాత్రం లేదని చెప్పవచ్చు. అయినా మేకర్స్ కీర్తి సురేష్.. సావిత్రి పాత్రకి ఎంచుకోవడం హర్షించదగ్గ విషయం. అందుకే ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు.. నిర్మాతలైన ప్రియాంక దత్, స్వప్న దత్‌లను దర్శకుడు నాగ్ అశ్విన్‌ని పొగడ్తలతో ముంచేశారు. ఇప్పుడు అలాంటి గొప్ప ప్రశంసలు మరోసారి అందుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాతి రత్నాలు’ సినిమా సక్సస్‌తో ప్రతీ ఒక్కరు ఎంతో సంతోషంగా ఉన్నారు. అమెరికాలో కరోనా తర్వాత రిలీజైన మొదటి సినిమా. రిలీజైనప్పటి నుంచి హౌజ్ ఫుల్ కలెక్షన్స్‌తో రికార్డ్స్ బద్దలయ్యే వసూళ్ళు సాధిస్తోంది. టాలీవుడ్‌లో కూడా 2021 ప్రథమార్థంలో భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా ‘జాతి రత్నాలు’ కొత్త రికార్డులు నమోదు చేస్తోంది.