‘‘నా చిన్నతనంలో ‘స్టార్ టెక్’ సీరియల్ తొలి ఎపిసోడ్ చూసినప్పుడే నాసా దిశగా నా అడుగులు పడ్డాయి. అదే నా గమ్యాన్ని నిర్దేశించింది.జేపీఎల్ (జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ)లో ఇదే నా తొలి మిషన్. ఇందులో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అని భారతీయ అమెరికన్ స్వాతీ మోహన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో అన్నారు. మార్స్ మిషన్ విజయవంతమైన నేపథ్యంలో.. నాసా బృందంతో అధ్యక్షుడు బైడెన్ వర్చువల్‌గా సమావేశమయ్యారు. పెర్సెవరెన్స్ ల్యాండింగ్‌లో కీలక పాత్ర పోషించిన స్వాతితో ఈ సందర్భంగా ఆయన ముచ్చటించారు. రోవర్ పంపించిన చిత్రాలు చూసిన తర్వాత.. మనం ఎప్పటికీ వెళ్లలేని ప్రదేశానికి వెళ్లి చూసినట్లనిపించిదంటూ బైడెన్‌తో తన అనుభవాలను పంచుకున్నారు స్వాతీ మోహన్.
