స్వారూపానంద ఆశీస్సులు తీసుకున్న సీపీఐ నారాయణ

0
522
Spread the love

విశాఖలో స్వరూపానందను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కలిశారు. జీవీఎంసీ 97వ వార్డు సీపీఐ అభ్యర్థి యశోద తరపున ప్రచారం చేస్తూ స్వరూపనందను నారాయణ కలిశారు. ‘‘మిమ్మల్ని కలిసిన వారందరీని గెలిపిస్తారంట కదా.. మా అభ్యర్థిని కూడా గెలిపించాలి’’ అని స్వరూపనందను నారాయణ కోరారు. స్వరూపానందను నారాయణ కలవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. విశాఖను సీపీఐ తరపును పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా నారాయణ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే స్వరూపానందను నారాయణ కలిశారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన 97వ వార్డులో ప్రచారం చేశారు. అయితే ఇదే వార్డులో స్వరూపనందస్వామి మఠం ఉండడంతో తమ అభ్యర్థిని గెలిపించాలని స్వామిని కోరారు. ఈ సందర్భంగా నారాయణకు స్వామి శాలువా కప్పి ఆశీస్సులు కూడా ఇచ్చారు. అక్కడ కొద్దిసేపు నారాయణ, స్వామితో మాట్లాడారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రచారంలో భాగంగా మఠానికి వెళ్లామని, అయితే ఈయన ఆశీస్సులు తీసుకుంటే గెలుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని, అందువల్ల ఆశీస్సులు సీపీఐ అభ్యర్థికి ఇవ్వాలని స్వామిని అభ్యర్థించామని నారాయణ తెలిపారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని నారాయణ వివరణ ఇచ్చారు.

జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులకు మంగళవారం వరకు 1,361 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 99 నామినేషన్లు నిబంధనల ప్రకారం లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు. దీంతో 1,262 మాత్రమే మిగిలాయి. వీటిలో టీడీపీ అభ్యర్థులుగా 361 మంది, వైసీపీ అభ్యర్థులుగా 342 మంది, జనసేన నుంచి 106 మంది, కాంగ్రెస్‌ నుంచి 80 మంది, బీజేపీ నుంచి 74 మంది, సీపీఎం నుంచి 35 మంది, సీపీఐ నుంచి 16, బీఎస్పీ నుంచి తొమ్మిది, ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా 237 నామినేషన్లు వేశారు. అయితే కరోనా కారణంగా అప్పట్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. కరోనా ఉధృతి తగ్గడంతో ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభిస్తూ ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది. గతంలో నామినేషన్లు వేసి ఐదుగురు అభ్యర్థులు మృతిచెందగా…వారి స్థానంలో కొత్తగా నామినేషన్లు వేసుకునేందుకు అవకాశం కల్పించింది. అక్కడ ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం 1,260 నామినేషన్లు వచ్చినట్టయింది. మంగళ, బుధవారాల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here