స్వేచ్ఛాయుత ‘ఇండో పసిఫిక్‌’కు ఓకే

0
172
Spread the love

స్వేచ్ఛాయుత, సురక్షిత, భాగ్యవంతమైన ఇండో- పసిఫిక్‌ ప్రాంత సాధనకు కట్టుబడి ఉన్నామని చతుర్భుజ(క్వాడ్‌) కూ టమి దేశాధినేతలు నరేంద్ర మోదీ(భారత ప్రధాని), జో బైడెన్‌(అమెరికా అధ్యక్షుడు), స్కాట్‌ మారిసన్‌(ఆస్ట్రేలియా ప్రధాని), యోషిహిడే సుగా(జపాన్‌ ప్రధాని) ప్రకటించారు. పర్యావరణ మార్పు ఇండో-పసిఫి క్‌ ప్రాంతానికేగాక, ప్రపంచ దేశాలన్నింటికీ సవాల్‌గా మారిందని, ఈ నేపథ్యంలో పారిస్‌ ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి తాము కలిసికట్టుగా పనిచేయడమే కాక, ఇతర దేశాలతోనూ కలిసి పని చేస్తామని వారు ఒక సంయుక్త సంపాదకీయంలో పేర్కొన్నారు. అలాగే కరోనా మహమ్మారి నిర్మూలనకు, వ్యాక్సిన్ల వేగవంతమైన సరఫరాకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం క్వాడ్‌ కూటమి అగ్రనేతలు తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా భేటీ అయ్యారు. తొలి సమావేశం తర్వాత.. 4 దేశాల అధినేతలూ కలి సి రాసిన ఓపెన్‌ ఎడిటోరియల్‌ ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ లో ప్రచురితమైంది.

తమ కూటమి ఒక సంక్షోభం లో పుట్టిందన్నారు. కొవిడ్‌ ఉన్నంతకాలం ఏ దేశమూ సురక్షితం కాద ని.. ఆ మహమ్మారిని నిర్మూలించడానికి క్వాడ్‌ కూటమి కట్టుబడి ఉంద ని ప్రకటించారు. సురక్షిత, ప్రభావవంతమైన వ్యాక్సిన్ల ఉత్పత్తిని భారత్‌లో విస్తరించాలని నిశ్చయించినట్టు తెలిపారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం మొత్తానికీ 2022 నాటికి వ్యాక్సిన్‌ అందేలా కృషి చేస్తున్నామన్నారు. డబ్ల్యూహెచ్‌వో, కొవాక్స్‌ సహా పలు సంస్థలతో కలిసి వ్యాక్సిన్‌ సరఫరా ను మరింత పెంచడానికి శాస్త్రీయ, ఆర్థిక, ఉత్పత్తి సామర్థ్యాలన్నింటినీ వినియోగిస్తామన్నారు. ఈ ప్రణాళికకు ‘క్వాడ్‌ వ్యాక్సిన్‌ ఎక్స్‌పర్ట్స్‌ వర్కింగ్‌ గ్రూప్‌’ మార్గదర్శిగా వ్యవహరిస్తుందన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here