న్యూఢిల్లీః సమాజ్ వాదీ కీలక నేత, మాజీ మంత్రి, ప్రస్తుత జాన్పూర్ ఎమ్మెల్యే శైలేంద్ర యాదవ్ తో ఆంధ్రప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. మురళీ మోహన్ యాదవ్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో సోమవారం ఈ భేటీ జరిగింది. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వుంటూ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కు కుడిభుజంగా శైలేంద్ర యాదవ్ వుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎపి, తెలంగాణ రాజకీయ అంశాలపై విస్త్రతంగా ఆయన చర్చించనట్లు తెలిసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం గురించి,బీసీ ఇతర మైనార్టీ వర్గాల సమ్యల గురించి పోరాడాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఏదో పార్టీతో పొత్తుపెట్టుకుని ఎదిగే దిశగా లేకుంటే స్వతంత్రంగానైనా పోటీ చేసేలా …పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించినట్లు చర్చ జరుగుతోంది. ఎపీలో బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తూ బీసీలను ఏకతాటిపైకి తెచ్చేలా మురళీ మోహన్ యాదవ్ ఇప్పటికే కృషి చేస్తుండటం…తో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

