హీరోల కొడుకులు హీరోలు అయిన‌ట్టే….ఈ హీరోయిన్స్ కూతుళ్లు హీరోయిన్స్ అయ్యారు! ఈ లిస్ట్ చూడండి!

0
674
Spread the love

డాక్టర్ల పిల్లలు డాక్టర్లు, యాక్టర్ల పిల్లలు యాక్టర్లు అవడం సహజం.. కానీ యాక్టర్ల కొడుకులు మాత్రమే యాక్టర్లుగా రానిస్తుంటారు..యాక్టర్ల కూతుర్లు సినిమాల్లోకి వచ్చిన దాఖలాలు తక్కువే..హీరోల కొడుకుల సంగతి మనకు తెలిసిందే.. కాని ఒకప్పటి స్టార్ హీరోయిన్ల కూతుర్లు హీరోయిన్స్ గా ఎంట్రి ఇచ్చిన సంగతి చాలామందికి తెలియదు..ఆ స్టార్ హీరోయిన్లెవరు??వారి కూతుర్లెవరో చూడండి..

లక్ష్మి- ఐశ్వర్య
ఒకప్పటి అందాల తార లక్ష్మి కూతురే ఐశ్వర్య.. ఐశ్వర్య కూడా హీరోయిన్ గా గుర్తింపు పొందింది..ప్రస్తుతం ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.. సమంతా ప్రధాన పాత్రలో వచ్చిన ఓ బేబి సినిమాలో తల్లికూతుళ్లు లక్ష్మి ,ఐశ్వర్య ఇద్దరూ నటించారు.
డాక్టర్ల పిల్లలు డాక్టర్లు, యాక్టర్ల పిల్లలు యాక్టర్లు అవడం సహజం.. కానీ యాక్టర్ల కొడుకులు మాత్రమే యాక్టర్లుగా రానిస్తుంటారు..యాక్టర్ల కూతుర్లు సినిమాల్లోకి వచ్చిన దాఖలాలు తక్కువే..హీరోల కొడుకుల సంగతి మనకు తెలిసిందే.. కాని ఒకప్పటి స్టార్ హీరోయిన్ల కూతుర్లు హీరోయిన్స్ గా ఎంట్రి ఇచ్చిన సంగతి చాలామందికి తెలియదు..ఆ స్టార్ హీరోయిన్లెవరు??వారి కూతుర్లెవరో చూడండి..

శ్రీదేవి – జాన్వికపూర్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వికపూర్ ధడక్ సినిమాతో బాలివుడ్లోకి అడుగుపెట్టింది.. పెళ్లి,పిల్లల తర్వాత పూర్తిగా కుటుంబానికే తన సమయాన్ని కేటాయించిన శ్రీదేవి జాన్వి సినిమా కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది..కానీ తన తొలిసినిమా చూడకుండానే కన్నుమూసింది.

లిజి- కళ్యాణి ప్రియదర్శన్
ఆత్మబంధం,20వ శతాబ్దం వంటి సినిమాల్లో సుమన్ సరసన నటించిన లిజి మళయాల నటి.. తన కూతురే కళ్యాణి ప్రియదర్శన్.. అఖిల్ డెబ్యూ మూవి హలో సినిమాతో ఎంట్రి ఇచ్చింది.. ఆ సినిమా హిట్ తో సంబంధం లేకుండా కళ్యాణి గుర్తింపు తెచ్చుకుంది . చిత్రలహరి, రణరంగం వంటి సినిమాల్లో నటించింది. సినిమాలకు దూరమైన లిజి మళ్లీ నితిన్ నటించిన లై సినిమాతో టాలివుడ్లొ ప్రత్యక్షమైంది.

మేనక – కీర్తిసురేశ్
చిరంజీవి సరసన పున్నమినాగు చిత్రంలో నటించింది మేనక.. ఎనభైల్లో ఎన్నో తెలుగు,మళయాల చిత్రాల్లో నటించింది.. మేనక కూతురే కీర్తి సురేశ్..మహానటి సినిమాతో ఒక్కసారిగా జాతియ స్థాయిలో గుర్తింపు పొందింది కీర్తి.

keeri and her mom

మంజుల – వనిత, శ్రీదేవి,ప్రీత
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మంజులకి ముగ్గురు కూతుర్లు..వనిత,ప్రీత,శ్రీదేవి.. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో వనిత తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా, ప్రీత రుక్మిణితో ఎంట్రి ఇచ్చి ప్రియమైన నీకు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి లాంటి సినిమాల్లో నటించింది.. ప్రభాస్ డెబ్యూ మూవి ఈశ్వర్ తో శ్రీదేవి పరిచయం అయింది.. ప్రస్తుతం ప్రీత,శ్రీదేవి సినిమాలకు దూరంగా ఉండగా, వనిత మూడో పెళ్లితో వార్తల్లో వ్యక్తిగా మారింది.

సంధ్య- జయలలిత
సినిమాల్లోనూ,తమిళ రాజకీయాల్లోనూ ప్రత్యేక ముద్ర వేసిన జయలలిత తల్లి కూడా నటే.. జయలలిత సినిమాల్లోకి రావడానికి తల్లి పాత్రే ప్రధానం.. చదువులో చురుకుగా ఉండే జయలలిత తల్లి ప్రోత్సాహంతో చిన్నవయసులోనే సినిమాల్లోకి వచ్చి స్టార్ గా గుర్తింపుపొందింది..తర్వాత ఎమ్జియార్ తో పరిచయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.

రాధ – కార్తిక,తులసి
ఎనభైల్లో ఇండస్ట్రీ హిట్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రాధ కి ఇద్దరు కూతుర్లు..కార్తిక,తులసి..నాగచైతన్య డెబ్యూ మూవి జోష్ సినిమాతో తెలుగు వారికి పరిచయం అయింది కార్తిక.. తమిళ డబ్ మూవీ రంగం సినిమాలో కూడా నటించి గుర్తింపు పొందింది.. మణిరత్నం వంటి డైరెక్టర్ తో కడలి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది తులసి..అయినప్పటికి తగినంత గుర్తింపు రాలేదు.

జీవిత – శివాని,శివాత్మిక
తలంబ్రాలు, అంకుశం లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో రాజశేఖర్ కి జోడిగా నటించిన జీవిత తర్వాత వివాహం చేసుకుని సినిమాలు వదిలేసారు..ఇప్పుడు వారిద్దరి కూతుర్లు శివాని ,శివాత్మిక సినిమాల్లోకి ఎంట్రి ఇస్తున్నారు.. పెద్ద కూతురు శివాని ఎంట్రి మధ్యలో ఆగిపోగా, చిన్నకూతురు శివాత్మిక దొరసాని సినిమాతో ఎంట్రి ఇచ్చింది.

సారిక – శృతిహాసన్, అక్షర హాసన్
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన సారిక బాలివుడ్లో హీరోయిన్ గా రాణించింది. సారిక, కమల్ ల ఇద్దరు కూతుర్లు శృతిహాసన్, అక్షర హాసన్ లు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నారు.. శృతి బాలివుడ్ తో పాటు సౌత్ లోనూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here