పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఘన విజయం సాధించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె విజేతగా నిలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో వాణీదేవి గెలిచారు. కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. టీఆర్ఎస్ అభ్యర్థిని వాణీదేవికి 1,28,010 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి.
