1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం

0
234
Spread the love

రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేశామని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. శాఖల వారీగా భర్తీ చేసిన పోస్టుల వివరాలను వెల్లడిస్తూ గురువారం ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు. పోస్టుల భర్తీ విషయంలో నిజానిజాలను దాచిపెట్టి.. కాంగ్రెస్‌, బీజేపీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. వివిధ శాఖల నుంచి సమాచారం సేకరించిన మీదటే భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యను తాను ప్రజల ముందు పెట్టానని, ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వ నిబద్ధతపై అనుమానాలుంటే ఆయా శాఖల్లో ధ్రువీకరించుకోవచ్చనీ చెప్పానన్నారు. నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుందన్న సామెత ఇవాళ రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుందని పేర్కొన్నారు. తమకు అలవాటైన అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను, ముఖ్యంగా యువతను గందరగోళపరచడానికి ప్రతిపక్షాలు మరో కొత్త నాటకాన్ని మొదలుపెట్టాయన్నారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన ఉద్యోగాల భర్తీ విషయంలో వాస్తవాలను దాచి కాంగ్రెస్‌, బీజేపీలు చెపుతున్న జూఠా మాటలు అందులో భాగమేనన్నారు. తాను వెల్లడించిన నిజాలను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పారు. జానారెడ్డి లాంటి సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కూడా ఈ అసత్యాలను వల్లె వేసేందుకే మొగ్గు చూపడం బాధాకరమన్నారు. ఆయన అన్నట్లుగా.. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామని తాము మాట ఇచ్చింది వాస్తవమేనని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగాలు కల్పిస్తూనే ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారన్న విషయాన్ని త్వరలో చెప్తామన్న జానారెడ్డి.. అందులో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా చెప్పాలని కోరారు. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తమ ప్రభుత్వం భర్తీ చేసిన 1,32,899 ఉద్యోగాల వివరాలను అంకెలతో సహా అందిస్తున్నానని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువతకి మరోసారి స్పష్టత ఇచ్చేందుకు, ప్రతిపక్షాల అసత్య ఆరోపణలతో అయోమయానికి గురికాకుండా ఉండేందుకే వివరాలను వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని మరోసారి చూసైనా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాన్ని మానుకుంటాయని ఆశిస్తున్నానని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ప్రయివేటు రంగంలో 14 లక్షల ఉద్యోగాలను కల్పించాం

ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే.. విప్లవాత్మకమైన టీఎ్‌సఐపాస్‌ విధానం తో ప్రైవేటురంగంలోనూ సుమారు 14లక్షల ఉద్యోగాలను ఆరేళ్లలో రాష్ట్ర యువతకు కల్పించామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఏ ప్రభుత్వానికి అయినా ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియని, ఇందులో భాగంగాఏ సీఎం కేసీఆర్‌ మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దానికి అనుగుణంగా భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ఈ ప్రక్రియను మరింత వేగవంతం గా పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి యువత అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

శాఖల వారీగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేటీఆర్‌ వెల్లడించిన వివరాలు..

తెలంగాణ సేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ – 30,594; తెలంగాణ ేస్టట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ – 31,972; తెలంగాణ స్టేట్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌- 3,623; ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ – హైదరాబాద్‌ – 179; శ్రీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ – హైదరాబాద్‌- 80; డైరెక్టర్‌, మైనారిటీస్‌ వెల్ఫేర్‌ – 66; జూనియర్‌ పంచాయతీ సెక్రెటరీలు – 9,355; డిపార్ట్‌మెంట్‌ అఫ్‌ ఆయూష్‌ – 171; టీఎస్‌ జెన్‌కో – 856; టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ – 164; టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ – 201; టీఎస్‌ ట్రాన్స్‌ కో – 206; టీఎ్‌సఆర్టీసీ – 4,768; సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ – 12,500; జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌ – 6,648; విద్యుత్‌ శాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్థీకరణ – 22,637; హైదరాబాద్‌ జలమండలి- 807; తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ – 243; డీసీసీబీలు – 1,571; భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉన్న ఉద్యోగాలు – 6,258; మొత్తం ఉద్యోగాల సంఖ్య 1,32,899.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here