న్యూఢిల్లీ: వైద్యవిద్యలో ప్రవేశాల కోసం ఏటా జరిగే నీట్ పరీక్షను ఈ ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రతి ఏడాది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నీట్ పరీక్షను నిర్వహిస్తుంది. అయితే, 2021లో మాత్రం ఎన్‌టీఏ ఒక్కసారే నీట్ పరీక్షను నిర్వహిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ నిషాంక్ పోఖ్రియాల్ వెల్లడించారు. లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయాన్ని పేర్కొన్నారు.

కాగా, ఒక్కసారే నీట్ పరీక్ష అనే అంశానికి సంబంధి ఇంకా ఎన్‌టీఏకు ఎలాంటి ఆదేశాలు అందలేదని మంత్రి పోఖ్రియాల్ తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖను సంప్రతించిన తర్వాతనే కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఎన్‌టీఏ నీట్ పరీక్ష నిర్వహిస్తుందని మంత్రి తన రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో.